2023 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది.
సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్ కు వరుణుడు అడ్డంకి తగిలాడు. ముందుగానే వాతావరణ సంస్థలు చెప్పిన విధంగా ఎంట్రీ ఇచ్చాడు. మ్యాచ్ ప్రారంభమైన గంటకే వర్షం పడింది. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి దక్షిణాప్రికా 14 ఓవర్లలో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ఈనెల 23న విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ-20 మ్యాచ్ జరగనుంది. టీ-20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల అమ్మకాలు 15, 16 తేదీల్లో పేటీఎం (ఇన్సైడర్.ఇన్) ద్వారా ఉ. 11.00 గం. నుంచి జరుగుతాయని ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథరెడ్డి తెలిపారు.
ప్రపంచకప్ 2023లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్ 15న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ నవంబర్ 16న కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగనుంది. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
వరల్డ్ కప్ 2023లో భాగంగా పూణే స్టేడియంలో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాని చిత్తు చేసింది. 307 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 44.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 177 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సెమీస్ ఆశలు మరింత బలమయ్యాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియాతో సిరీస్ కు టీమిండియా బాధ్యతలు ఎవరు చేపడుతారన్నది సస్పెన్స్ గా మారింది. ఓ పక్క రోహిత్ శర్మ ఆటడం లేదు, మరోపక్క వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కాలికి గాయం కారణంగా వరల్డ్ కప్ టోర్నీ నుంచే దూరమయ్యాడు. అయితే అతను పూర్తిగా కోలుకోవడానికి 6 వారాల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
ఫైనల్‌కు చేరుకునే రెండు జట్లను ఆస్ట్రేలియా స్పిన్నర్ అస్టన్ అగర్ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడతాయని అగర్ జోస్యం చెప్పాడు.