IND vs AUS: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ సంగ్రామం జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు. క్రీజులో ఉన్నంతసేపు రోహిత్ (47) పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ మరో ఓపెనర్ గిల్ ఫైనల్ మ్యాచ్ లో విఫలమయ్యాడు.
Read Also: World Cup Final 2023: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. కెప్టెన్గా అత్యధిక పరుగులు
ఇదిలా ఉంటే.. గత 10 ఓవర్లు నుంచి టీమిండియాకు ఒక్క బౌండరీ రాలేదు. వెంట వెంటనే 3 వికెట్లు కోల్పోవడంతో క్రీజులో ఉన్న కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నప్పుడే బౌండరీలు, సిక్సర్లు వచ్చాయి. దాదాపు గంట నుంచి టీమిండియాకు బౌండరీ రాలేదు. ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్లు విఫలమవ్వడంతో నిలకడగా ఆడుతున్నారు. క్రీజులో విరాట్ కోహ్లీ (49), కేఎల్ రాహుల్ (25) ఉన్నారు. ఈ వార్త రాసే సమయానికి భారత్ స్కోరు 25 ఓవర్లకు 131/3 పరుగులు చేసింది.
Read Also: Israel-Hamas War: బందీల విడుదలపై ఒప్పందం.. ఇజ్రాయిల్ రియాక్షన్ ఇదే..