రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతుండగా.. మధ్యలో ఓ వ్యక్తి ఫోన్ రింగ్ అయింది. దీనిపై రోహిత్ శర్మ కోపంగా.. "ఏంటీ, ఫోన్ ఆఫ్ చెయ్యి మ్యాన్" అని అన్నాడు. ఆ తర్వాత పిచ్ పరిస్థితి గురించి మాట్లాడు. ఇంతకుముందు కూడా.. రోహిత్ శర్మ తన ఫన్నీ స్టైల్స్, కామెంట్స్ తో చాలా సార్లు వైరల్ అయ్యాడు.
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అనంతపురం జిల్లాలో బెట్టింగురాయుళ్లపై ప్రత్యేక నిఘా విధించింది సైబర్‌సెల్. అనంతపురం పోలీస్ సైబర్ సెల్ ద్వారా సుమారు 70 బెట్టింగ్ ఆన్లైన్ యాప్‌లను గుర్తించారు. ఈ యాప్‌లను నిషేధించాలని సంబంధిత శాఖలకు జిల్లా ఎస్పీ సిఫారసు లేఖ రాశారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించమన్నారు.
World Cup 2023: దాదాపుగా 20 ఏళ్ల తరువాత భారత్, ఆస్ట్రేలియా జట్లు వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో తలపడబోతున్నాయి. చివరి సారిగా 2003లో భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్స్‌లో ఆడాయి. సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ నేతృత్వంలో ఈ రెండు జట్లు మ్యాచ్ ఆడాయి. అయితే ఈ మ్యాచ్ మాత్రం కోట్లాది మంది భారత అభిమానులకు చేదు జ్ఞాపకం మిగిల్చింది. ఆసీస్ కెప్టెన్ రికీపాంటింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగి భారత విజయాన్ని అడ్డుకున్నాడు
రేపు (ఆదివారం) ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మహా సంగ్రామం జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచ దేశాల అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం ఏర్పాటు చేసిన పిచ్ పరిస్థితులను ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, పాట్ కమిన్స్ పరిశీలించారు.
అహ్మదాబాద్‌లో జరిగే వరల్డ్ కప్ ఫైనల్ కోసం ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా అన్నీ మ్యాచ్ ల్లో గెలిచి మంచి జోష్ లో ఉంది. అయితే వరల్డ్ కప్ సాధించి చరిత్ర సృష్టించేందుకు భారత్ కేవలం ఒక్క అడుగుదూరంలో ఉంది. ఇదిలా ఉంటే.. ఆసీస్ జట్టుకు ప్రపంచకప్ ఫైనల్ లో ట్రోఫీ సాధించడం వెన్నతో పెట్టిన విద్య లాంటిది. ఇప్పటికే ఐదు సార్లు జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. మరో…
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు మరొక రోజే సమయం ఉంది. ఈ మహాసంగ్రామం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఈ టోర్నీలో అన్నింటిలో అన్నీ మ్యాచ్‌లు గెలిచి మంచి ఫాంలో ఉన్న టీమిండియాను ఒక సమస్య భయపెడుతుంది. అదేంటంటే.. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టైటిల్ మ్యాచ్‌లో, టీమిండియాకు అచ్చురాని అంపైర్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతనే రిచర్డ్ కెటిల్‌బరో.. ఇప్పుడు ఈ అంఫైర్ టీమిండియాకు పెద్ద ముప్పులా మారే అవకాశం ఉంది.
వరల్డ్ కప్ 2023 ఫైనల్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. ఈ మెగా టోర్నీ చివరిపోరులో ఏ జట్టు టైటిల్ గెలుస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితం రావాలంటే ఒక్కరోజు వేచిచూస్తే సరిపోతుంది. ఈ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చాలా అద్భుతంగా ఉండనుంది. కొన్ని ప్రిడిక్షన్స్ ప్రకారం.. టీమిండియా ఇన్నింగ్స్ వేగంగా ప్రారంభించి.. ఆ తర్వాత ఎదురుదెబ్బలను ఎదుర్కొంటుందని తెలుపుతున్నారు. మరోవైపు.. ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ సాధించి సరికొత్త…
వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. తొలి సెమీ ఫైనల్ ఇండియా-న్యూజిలాండ్ తలపడగా.. భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక.. రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఫైనల్లో టీమిండియాతో తలపడనుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా పోరు జరుగనుంది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలుపొందింది. ఉత్కంఠపోరులో 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.
ఆస్ట్రేలియా జట్టు ఈ పరుగులు చేయకుండ ఉండటానికి.. జట్టుకు మంచి బౌలింగ్, ఫీల్డింగ్ అవసరం. అలాంటి క్రమంలో సౌతాఫ్రికా జట్టులో ఫీల్డింగ్ లో కొంత వైఫల్యం ఏర్పడినప్పటికీ.. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ మాత్రం ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి కళ్లు బైర్లు కమ్మేలా చేశాడు.