విశాఖలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ముందు ఆస్ట్రేలియా భారీ టార్గెట్ ను ముందుంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ .. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ శతకం సాధించాడు. కేవంల 50 బంతుల్లోనే 110 పరుగులు చేశాడు.
ఐదు టీ20 సిరీస్ లో భాగంగా.. భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. విశాఖ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫైనల్ లో ఆస్ట్రేలియాతో ఓటమి తర్వాత టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. అయితే, ప్రస్తుతం వైజాగ్‌లో వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది.
రోహిత్ శర్మ లాగే తాను కూడా టీమ్ కు ఉపయోగపడే సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటానని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. వ్యక్తిగతంగా మైలురాళ్లను ఇష్టపడే వ్యక్తిని కాదన్నాడు.
విశాఖ వేదికగా రేపు ఇండియా-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐదు టీ20 సిరీస్ లో భాగంగా.. వైజాగ్ లోని రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. గురువారం రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
David Warner withdraws from T20 Series vs India: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 23 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించగా.. తాజాగా ఆస్ట్రేలియా టీంలో సీఏ కీలక మార్పు చేసింది. టీ20 సిరీస్ నుంచి స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు సీఏ విశ్రాంతిని ఇచ్చింది. ప్రపంచకప్ 2023లో 535 పరుగులతో ఆస్ట్రేలియా టాప్ స్కోరర్‌గా నిలిచిన వార్నర్.. ఇదివరకు…
45 రోజుల పాటు భారత్‌లో వరల్డ్ కప్ ఫీవర్ నడిచింది. తాజాగా ఆదివారం ఫైనల్ లో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ తో ప్రపంచ కప్ 2023 పూర్తయింది. అయితే ఈసారి ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంటారని అనుకున్న టీమిండియా అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా చేతిలో చూడాలంటే ఇంకో నాలుగేళ్లు వేచి చూడాల్సిందే. వన్డే క్రికెట్లో తదుపరి ప్రపంచకప్ 2027లో జరగనుంది.
విశాఖ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఈనెల 23న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పలువురు టీమిండియా ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు.
వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా ఆరోసారి కప్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ పై అభిమానులతో పాటు.. ఇటు ఆటగాళ్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఉండి.. టైటిల్ మ్యాచ్ లో ఓడిపోవడంతో టీమిండియా ఆటగాళ్లు కన్నీటిపర్యంతం అయ్యారు.