IND vs AUS: ఆస్ట్రేలియా టార్గెట్ 241.. భారం బౌలర్లపైనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఉన్నంతసేపు స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఈ మ్యాచ్ లో భారీ స్కోరును ఊహించుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆసీస్ బౌలర్ల ముందు టీమిండియా బ్యాటర్లు తడబడటంతో.. తక్కువ స్కోరును నమోదు చేశారు. టీమిండియా బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్ (66) అత్యధిక స్కోరు చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (54), రోహిత్ శర్మ (47), సూర్యకుమార్ యాదవ్ (18) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా 10 పరుగుల లోపే ఔటయ్యారు. భారత్ ఇన్నింగ్స్ లో 11 ఓవర్ల నుంచి 40 ఓవర్ల మధ్య కేవలం రెండు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. దీనిబట్టి అర్ధం చేసుకోవచ్చు. ఆసీస్ బౌలర్లు ఎలా విరుచుకుపడ్డారనేది. ఇక.. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత జోష్ హేజిల్ ఉడ్, పాట్ కమిన్స్ తలో రెండు వికెట్లు సంపాదించారు. మ్యాక్స్ వెల్, జంపాకు కూడా చెరో వికెట్ లభించింది.
Read Also: Kodali Nani : టీడీపీకి బీ టీమ్ దగ్గుబాటి పురంధరేశ్వరి
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
టాస్ ఓడి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత్ ను బ్యాటింగ్ కు పంపింది. ఈ క్రమంలో ఆరంభంలో రోహిత్ శర్మ దూకుడు ఇన్నింగ్స్ ఆడి.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ 47 పరుగుల వద్ద భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. అంతకుముందు గిల్ 4 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇక.. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పోయిన మ్యాచ్ లో సెంచరీ హీరో కేవలం 4 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడి స్కోరుబోర్డును నడిపించారు. ఆ తర్వాత జడేజా 9 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్యకుమార్ 18 పరుగులు పెవిలియన్ బాట పట్టాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు భారమంతా టీమిండియా బౌలర్లపైన ఉంది. మొదట్లో బుమ్రా, సిరాజ్ వికెట్లు తీస్తే.. ఆ తర్వాత మహమ్మద్ షమీ కూడా వికెట్లు తీయగల సత్తా ఉంది.
- Tags
- Australia
- final
- india
- match
- telugu news
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!