ప్రపంచకప్ 2023 ఫైనల్లో టైటిల్ పోరు కోసం భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నవంబర్ 19న(రేపు) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సమయంలో ఓ సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Dil Raju:’మంగళవారం’ చూస్తున్నప్పుడు ‘అరుంధతి’ గుర్తొచ్చింది
రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతుండగా.. మధ్యలో ఓ వ్యక్తి ఫోన్ రింగ్ అయింది. దీనిపై రోహిత్ శర్మ కోపంగా.. “ఏంటీ, ఫోన్ ఆఫ్ చెయ్యి మ్యాన్” అని అన్నాడు. ఆ తర్వాత పిచ్ పరిస్థితి గురించి మాట్లాడు. ఇంతకుముందు కూడా.. రోహిత్ శర్మ తన ఫన్నీ స్టైల్స్, కామెంట్స్ తో చాలా సార్లు వైరల్ అయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ సెంచరీ చేయడంతో అతన్ని ఇమిటేట్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Read Also: Halal: హలాల్ ఉత్పత్తులపై ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ నిషేధం..
ఈ సమావేశంలో రోహిత్ శర్మ ప్లేయింగ్ ఎలెవన్, పిచ్ పరిస్థితి గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఆఖరి మ్యాచ్‌లో టాస్ పర్వాలేదని.. మెరుగైన క్రికెట్ ఆడాలని చెప్పాడు. ఈ సందర్భంగా.. రోహిత్ శర్మ టీమిండియా ఫాస్ట్, స్పిన్ బౌలర్లను ప్రశంసించాడు. ఇది వారికొక పెద్ద అవకాశమని తెలిపాడు. ఈ ప్రపంచకప్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని అన్నాడు. మరోవైపు.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటమే ముఖ్యమని, 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఆలోచించాల్సిన అవసరం లేదని రోహిత్ శర్మ చెప్పాడు.
Rohit Sharma – "Kya yaar phone band rakho yaar" 😂😂 pic.twitter.com/kvJfXtTNy0
— 𝐑𝐮𝐠𝐠𝐚™ (@LoyalYashFan) November 18, 2023