వరల్డ్ కప్ 2023లో భాగంగా పూణే స్టేడియంలో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాని చిత్తు చేసింది. 307 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 44.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ 177 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సెమీస్ ఆశలు మరింత బలమయ్యాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియాతో సిరీస్ కు టీమిండియా బాధ్యతలు ఎవరు చేపడుతారన్నది సస్పెన్స్ గా మారింది. ఓ పక్క రోహిత్ శర్మ ఆటడం లేదు, మరోపక్క వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కాలికి గాయం కారణంగా వరల్డ్ కప్ టోర్నీ నుంచే దూరమయ్యాడు. అయితే అతను పూర్తిగా కోలుకోవడానికి 6 వారాల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
ఫైనల్కు చేరుకునే రెండు జట్లను ఆస్ట్రేలియా స్పిన్నర్ అస్టన్ అగర్ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడతాయని అగర్ జోస్యం చెప్పాడు.
Ind vs Eng: ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023లో భారత జట్టు తన ఆరో మ్యాచ్ని ఇంగ్లండ్తో ఆడనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఆదివారం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
ఉత్కంఠభరిత పోరులో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 5 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది. చివర్లో జిమ్మీ నీషమ్ (58) దూకుడుగా ఆడినప్పటికీ చివరి ఓవరల్ రనౌట్ రూపంలో వెనుతిరిగాడు. నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ 383/9 పరుగులు చేసింది.
నెదర్లాండ్స్ 9 పరుగులకే ఆఖరి 5 వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని అందుకుంది. నెదర్లాండ్స్పై ఆస్ట్రేలియా 310 పరుగుల భారీ తేడాతో కొత్త ప్రపంచకప్ రికార్డును నెలకొల్పింది.