CM KCR: వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తామని, అందరూ జాగ్రత్తగా పనిచేయాలని లేదంటే నేను ఏమీ చేయలేనని సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలో మాట్లాడుతూ.. మీరు బాగా పని చేసుకుంటే టికెట్లు మీకే అన్నారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రకటించడంపై ఘాటుగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు కలవర పెడుతున్నాయి. అధికార కాంగ్రెస్ లో సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య వివాదం ముదురుతోంది.
కర్ణాటక ఎన్నికల్లో స్టార్ వార్ కొనసాగుతోంది. ఓవైపు పార్టీ నాయకులు ప్రచారం చేస్తుంటే.. దానికి సినీ గ్లామర్ ని కూడా టచ్ చేశారు. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో సుదీప్ అధికార బీజేపీ తరుపున ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఇతర నటులపై కూడా ఫోకస్ పెట్టాయి.
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ బీజేపీకి కొత్త చీఫ్‌గా సీపీ జోషి ఎన్నికయ్యారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
హై-వోల్టేజ్ ప్రచారాల తర్వాత, రెండు కీలక ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌లలో ఎన్నికల పోరు తుదిదశకు చేరుకుంది. ఎందుకంటే ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని సోమవారం నిర్ణయిస్తారు.