Delhi BJP: నేడు ఢిల్లీలో బిజెపి కీలక సమావేశం.. 2024 సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi BJP: 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడంతోపాటు.. ఈ ఏడాది చివర్లో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం భారతీ జనతా పార్టీ(బీజేపీ) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా బీజేపీ అధిష్టానం సమావేశాల మీద సమావేశాలను నిర్వహిస్తోంది. బీజేపీలో ఉన్న నాయకుల్లో ఐక్యతను నింపడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అర్థరాత్రి అత్యవసరంగా బీజేపీ ఎన్నికల వ్యూహా కమిటీ సమావేశాన్ని తన నివాసంలో నిర్వహించారు. సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో ఎన్నికల వ్యూహా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా సుమారు 5 గంటలపాటు సమావేశం జరిగింది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ మరో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇంచార్జ్ లు, వివిధ మోర్చాల అధ్యక్షులు, మోర్చాల ఇంచార్జ్ లతో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సమావేశం కానున్నారు.
Read also: Telangana BJP: బీజేపీలో కీలక మార్పులు..! బండిని తప్పిస్తే పార్టీ చీఫ్ ఎవరు..?
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
డిసెంబర్‌లో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం పార్టీ బలోపేతం చేయడం.. పార్టీ సంస్థాగత అంశాలు వాటితోపాటు ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశాన్ని ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు ధఫాలుగా నిర్వహించనున్నారు. ఉదయం జరిగే సమావేశంలో మొదటగా జాతీయ ప్రధాన కార్యదర్శులతో తర్వాత మోర్చాల అధ్యక్షులతో పార్టీ పరిస్థితులపై అధిష్టానం చర్చించనుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఒక నివేదిక రూపంలో అధిష్ఠానానికి నాయకులు సమర్పించనున్నారు. డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం లో పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల వ్యూహాలు, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ పార్టీ కార్యచరణపై అధిష్టానం పెద్దలు సమావేశానికి హాజరైన నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!