అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్‌లో జరిగిన తరహాలో రాష్ట్రంలో కూడా కులాల సర్వే నిర్వహిస్తామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో హంగ్ వస్తుందంటూ బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ కామెంట్స్ చేశారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టికెట్లు హైదరాబాద్, ఢిల్లీలో ఇవ్వరు.. అనవసరంగా నేతల చుట్టూ తిరగొద్దు అని చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులతో సీఈసీ భేటీ అయింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్‌తో పాటు మిజోరాం ఎన్నికల పరిశీలకులతో అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్చించింది.
ఒకే దేశం- ఒకే ఎన్నిక' అనే చర్చ దేశంలో జోరందుకుంది. శుక్రవారం అంటే సెప్టెంబర్ 1న, కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా స్పందించాడు. తాను అసలు రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశాడు. తాను ఏ పార్టీ తరఫున పోటీ చేయడం లేదని.. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని అతడు తేల్చి చెప్పాడు.
018లో జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కాంగ్రెస్ నుండి బీజేపీకి వచ్చిన ఇద్దరు సహచరులపై బీజేపీ విశ్వాసం ఉంచింది. రాబోయే ఎన్నికలలో వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వారికి అవకాశం ఇచ్చింది. ఈ జాబితాలో ఎడల్ సింగ్ కంసనా మరియు ప్రీతమ్ సింగ్ లోధి పేర్లు ఉన్నాయి. అయితే అదే సమయంలో సింధియాతో కలిసి బీజేపీలోకి వచ్చిన రణ్‌వీర్ జాతవ్‌కు టికెట్ దక్కలేదు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడంతోపాటు.. ఈ ఏడాది చివర్లో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం భారతీ జనతా పార్టీ(బీజేపీ) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
Karnataka Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ 136 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. ఫలితాల్లో బీజేపీ 65 స్థానాలకే పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో కర్ణాటక రాజకీయ ఆనవాయితీ పునరావృతమైంది.