CM KCR: వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తాం.. జాగ్రత్తగా పనిచేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తామని, అందరూ జాగ్రత్తగా పనిచేయాలని లేదంటే నేను ఏమీ చేయలేనని సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలో మాట్లాడుతూ.. మీరు బాగా పని చేసుకుంటే టికెట్లు మీకే అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లు జాగ్రత్తగా పని చేసుకోండని సూచించారు. షెడ్యూలు ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే ఇబ్బంది …నేను చేయడానికి ఏమి ఉండదని తెలిపారు. రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేసినామని తెలిపారు. అదే పంథాలో అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామన్నారు సీఎం. అకాలవర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలని పిలుపు నిచ్చారు. మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటామని భరోసా ఇచ్చారు. మార్క్ ఫెడ్ కు ఈ మేరకు ఆదేశాలిస్తమన్నారు సీఎం కేసీఆర్.
Read also: Girls things: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలు ఏం చేస్తారో తెలుసా?
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
2021-2022 కు ముందు జీఎస్టీ ఆదాయం 34 వేల కోట్లు వుంటే, అంచనా 44 వేల కోట్లు పెట్టుకున్నామన్నారు. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచామన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలని కోరారు. కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద ఇలా ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లేసుకుని వచ్చి చూసిపోతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. క్యాడర్ లో అసంతృప్త్తిని తగ్గించే చర్యలు చేపట్టండని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశమన్నారు. ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్ బట్ బై చాయిస్ అన్నారు సీఎం కేసీఆర్. దూపయినప్పుడు బావి తవ్వుతం అనే రాజకీయం నేడు కాలానికి సరిపోదన్నారు. తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టీవీ యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా మన పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టవచ్చని అన్నారు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ ను కూడా నడపవచ్చని సూచించారు.
CM KCR: క్యాడర్ లో అసంతృప్తిని తగ్గించండి.. అవసరమైతే టీవీ ఛానల్ ను నడపండి
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?