Election Survey: ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో గుజరాత్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఆమ్‌ఆద్మీ కూడా పోటీ చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న విషయంపై ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ మేరకు గుజరాత్‌లో వరుసగా ఏడోసారి కమలం పార్టీనే విజయం సాధిస్తుందని సర్వే రిపోర్టుల్లో…
B.Sc. Formula: బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అని మాత్రమే మనకు తెలుసు. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని బీజేపీ వేరే అర్థం చెబుతోంది. బీఎస్సీ అంటే బ్రాహ్మణులు, షెడ్యూల్డ్ కులాలంటోంది. ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సరికొత్త ఫార్ములాతోనే గెలవాలనుకుంటోంది.
మాజీ మంత్రి, దివంగత ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి మే 30న ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్…
అసలు ముందస్తుకు వెళ్లే ఆలోచనే లేదని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమయంలో అసెంబ్లీ స్థానాల్లో సర్వేలు జరుగుతున్నాయని తెలిపారు.. ఆరు నూరైనా ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమన్న ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. అయితే, కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నేతలు. ఎన్నికలు, సీట్లపై స్పందించిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్… కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్…
త్వరలోనే ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. తాము కూడా ఎన్నికలు రెడీగా ఉన్నామని చెప్పారు. నెత్తిమీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమన్నారు చంద్రబాబు. రేపో ఎల్లుండో సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారన్న చంద్రబాబు.. రోజు రోజుకూ పతనావస్థకు వెళ్తున్నారని.. మరిన్ని రోజులు గడిస్తే వ్యతిరేకత పెరుగుతుందని సీఎం భయపడుతున్నారని తెలిపారు.. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా…
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. ప్రధాని మోదీని కథ తేలుస్తా.. గద్దె దించేవరకు నిద్రపోనని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని రేవంత్ ఆరోపించారు. జార్ఖండ్‌లో సీఎం హేమంత్ సోరేన్‌ను కలిసిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి ఫ్రంట్ పెట్టడంలేదని కేసీఆర్ చెప్పారని విమర్శించారు. కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని.. రాష్ట్రంలో పేదల కష్టాలు తీర్చాల్సిన ఆయన దేశం అంతటా…
భారత రాజకీయాల్లో ఒక మాట చాలా ప్రసిద్ధి. అదేంటంటే ఢిల్లీ రహదారి లక్నో నుంచే వెళుతుంది అని. దాని ప్రకారం ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని. ఇంకో మాటలో చెప్పాలంటే యూపీని గెలవకుండా ఢిల్లీని గెలవలేరని అర్థం. ప్రజాభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ మధ్యనే ప్రధాన పోటీ. బీజేపీ జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌కు పెద్ద పాత్ర ఉండకపోవచ్చు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని…
ఎన్నికలు వస్తే చాలు రాజకీయ పార్టీలు ప్రజలపై ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలన్నీ హామీలిచ్చే పనిలో పడ్డాయి. తాజాగా యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కొత్త హామీని ప్రకటించింది. మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు ఉచిత రేషన్‌తో పాటు పేదలకు కిలో నెయ్యి ఇస్తామని ప్రకటించారు. పేదల…
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకు యూపీ, గోవా లో పోలింగ్ ప్రారంభం కాగా, ఉత్తరాఖండ్ లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 3 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ పోలింగ్ జరుగుతుండగా, గోవా, ఉత్తరాఖండ్‌లో ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది. అయితే మూడు రాష్ట్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.…
దేశవ్యాప్తంగా మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండగా.. తొలి విడతలో పోలింగ్ జరిగే గోవా, ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడింది.. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకే విడతలో ఈ నెల 14వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.. అయితే, మిగతా మూడు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ముగిసిన తర్వాత మార్చి 10వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ తమ పార్టీలకు అనుకూలంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో రెండు…