Jalagam Venkatarao: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారు.
Nagam Janardhan Reddy: నేడు నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్.. జనార్దన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించనున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) రుణాలను మాఫీ చేయడం, కొత్త పథకం కింద సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లు, రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స వంటి అనేక చర్యలను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం హామీ ఇచ్చారు.
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న రైతుబంధు పథకాన్ని ఆపేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ పథకాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఏడు సంవత్సరాల నుంచి అమలవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి రాగానే రూ. 750కి ఎల్‌పిజి సిలిండర్, నెలకు రూ. 2 వేలు పెన్షన్, రూ. 15 లక్షల వరకు ఆరోగ్య బీమా ఇస్తామని హమీలు ఇచ్చారు.
BJP first list:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ ఆదివారం విడుదల చేసింది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
తెలంగాణ అభివృద్ది చేసి అప్పులు తీర్చి.. నిరుద్యోగులకు ఉద్యోగాలు.. ప్రతి నియోజకవర్గంలో ఉచిత విద్యా-వైద్యం ఆస్పత్రులు కట్టి అభివృద్ది చేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థులకు బంఫర్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.
రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 23న రాజస్థాన్లో పోలింగ్ జరగనుంది. అదే రోజు దేవ్ ఉథాని ఏకాదశి కావడం గమనార్హం. అంటే ఆ రోజు రాష్ట్రంలో 50,000 కంటే ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కంచుకోటగా పేరుగాంచిన బుద్ని నుంచి పోటీ చేయనున్నట్టు సోమవారం విడుదల చేసిన బీజేపీ నాల్గవ అభ్యర్థుల జాబితా వెల్లడించింది.
ఐదు రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లోని పార్టీలు ఇప్పటికే జోరుగా ప్రచారం ప్రారంభిస్తున్నాయి. తమ అభ్యర్థుల జాబితాలను పార్టీలు సిద్ధం చేసుకుంటున్నాయి.