BJP: అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం.. ఆ రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ బీజేపీకి కొత్త చీఫ్‌గా సీపీ జోషి ఎన్నికయ్యారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లో ఈసారి అధికారం చేపట్టాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల ముందు వ్యూహాలు రచిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిగా లోక్‌సభ ఎంపీ సీపీ జోషిని నియమించింది. బ్రాహ్మణ ఓట్లను ఆకర్షించడానికి జోషిని నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహాంలో భాగమే అనే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: TSRTC : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టీఎస్‌ఆర్టీసీ మరో నిర్ణయం
రాజస్థాన్‌లో రెండు ప్రధాన కులాలు ఉన్నాయి. రాజ్‌పుత్‌లు, జాట్‌ల ఓట్లే ఎన్నికల్లో కీలకంగా మారుతాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. చిత్తోర్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన 47 ఏళ్ల జోషి.. గత లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లో అత్యధిక ఓట్లతో గెలుపొందిన రాజకీయ నాయకుడిగా రికార్డు సృష్టించారు. రాజస్థాన్ బీజేపీలోని ఏ వర్గంతోనూ పొత్తుపెట్టుకోని ఆయన పార్టీలకతీతంగా ఉంటారని భావిస్తున్నారు. అతను రాజస్థాన్‌లో బిజెపికి అతిపెద్ద క్రౌడ్-పుల్లర్ అయిన మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో సన్నిహితంగా లేరు.
Also Read: Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్‌కు అరుదైన గౌవరం.. చరిత్ర సృష్టించిన బాబర్
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిజెపి కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించడంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. గత రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం ఇప్పటికే ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేశారు. కొత్త నాయకుడి నేతృత్వంలో పార్టీకి కొత్త శక్తి వస్తోందని బిజెపి నాయకత్వం భావిస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీహార్, ఒడిశా, ఢిల్లీలో కొత్త రాష్ట్ర అధ్యక్షులను కూడా బీజేపీ నియమించింది. ఇతర వెనుకబడిన వర్గ నాయకుడు, శాసన మండలి సభ్యుడు సామ్రాట్ చౌదరి పార్టీ బీహార్ విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. మాజీ రాష్ట్ర మంత్రి మన్మోహన్ సమాల్ ఒడిశాలో పార్టీకి నాయకత్వం వహిస్తారు. ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవా రాజధానిలో పార్టీ చీఫ్‌గా ఎదిగారు.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి