మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత సామాన్యుడిలా రైల్వే ప్లాట్ ఫాం మీద కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయనగరం రైలులో ప్రయాణించుటకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ అరుగు మీద కూర్చున్నారు. గతంలో కేంద్ర విమానయానశాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు రాజకుటుంబానికి చెందినవారు. అయితే సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన.. ఒక సామాన్య ప్రయాణికుడిలా రైల్వే స్టేషన్‌లో కనిపించారు.…
RK Roja: ప్రతిపక్ష నాయకులు సెల్ఫీలతో డ్రామా చేస్తున్నారు.. వాళ్ళు చేసిన సెల్ఫీ డ్రామా ప్రతిపక్ష నేతలనే సెల్ఫ్ గోల్ లో పడేస్తుందని వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రోజా.. విజయనగరంలో పర్యటించిన ఆమె.. పట్టణంలోని మహిళా పార్క్ ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వం మహిళా పక్ష పాత ప్రభుత్వం అన్నారు.. మహిళలు పిల్లలతో పాటు కాలక్షేపం చేయడానికి మహిళా పార్క్ నిర్మించడం జరిగిందన్నారు.. ప్రతిపక్ష నాయకులు సెల్ఫీ లతో డ్రామా చేస్తున్నారు..…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై హాట్ కామెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతి రాజు.. ఒక రాజధానిగా ఉన్నా.. ఇప్పుడే ఏ అధికారి దొరకడం లేదు.. మూడు రాజధానులు చేస్తే ఎక్కడికి వెళ్లాలి? అని ప్రశ్నించారు.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు వికేంద్రీకరణ అంటే ఏంటి..? అని నిలదీశారు.. కేంద్రం ఇచ్చిన నిధులను ఏమి చేస్తున్నారు? అని మండిపడ్డ ఆయన.. రాజధానిని మూడు…
ఉత్తరాంధ్రలో కీలకంగా ఉండే ఉమ్మడి విజయనగరం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అధినేతలు సైతం ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించేవారు. రోజులన్నీ ఒకేలా ఉండవన్నట్టు రాజకీయం మారిపోయింది. 2014 ఎన్నికల తర్వాత అది స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు శిబిరంలో కొందరు… ఆయనంటే గిట్టని వారు మరో శిబిరంలో చేరిపోయారు. 2014లో టీడీపీ గెలిచాక.. జిల్లా ఇంఛార్జ్…
సింహాచలం దేవస్ధానం ట్రస్ట్ బోర్డు వివాదం ఇప్పట్లో చల్లారేటట్టు కనిపించడం లేదు. కోర్టు నిర్ణయానికి అనుగుణంగా అనువంశిక ధర్మకర్త, చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు చేపట్టారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఆహ్వానితులుగా అధికారపార్టీకి అనుకూలమైన వ్యక్తులు నామినేట్ అయ్యారు. పాలకమండలి కూర్పు ప్రభుత్వ నిర్ణయాధికారమే అయినప్పటికీ.. అది కొలువుతీరిన తీరు చర్చగా మారింది. చైర్మన్‌గా అశోక్ గజపతిరాజుకు ఆహ్వానం లేకుండానే అధికారులు కథ నడిపించేశారు. ఈ అంశాన్ని అశోక్ సీరియస్‌గా తీసుకుని న్యాయ సలహా కోరడంతో…
విజయనగరం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాయి. అలాంటి చోట టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ఎవరి నోట విన్నా ఆ మహిళా నేతలే పేర్లే చర్చల్లో ఉంటున్నాయి. విజయనగరంపై పట్టుకోసం అదితి గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గట్టిగా పోటీ పడుతున్నారు. 2019 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి ఉంది. 2019లో సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతను కాదని.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ ఇచ్చారు.…