Kolagatla Veerabhadra Swamy: విజయనగరంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. అశోక్ గజపతిరాజు చిప్ ట్రిక్స్ మానుకోవాలి అంటూ.. కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేతపై మండిపడ్డారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిజంగా పూలే విగ్రహానికి దండ వేయాలని అనుకుంటే ముందు రోజే మాకు తెలియజేస్తే మేమే తాళం తీయిస్తాం కదా? అని ప్రశ్నించారు. ఇటీవల వాటర్ ఫౌంటైన్ సుందరికారణ చేశాం.. ఎవరూ పాడుచేయకూడదు అనే తాళం వేయడం జరిగిందన్న ఆయన.. కానీ, మీరు ఎటువంటి సమాచారం లేకుండా గేటుకి దండ వేసి వెళ్లిపోయారు.. దీనిని రాజకీయంగా వాడుకోవాలి అని అనుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
Read Also: Pawan Kalyan: పవన్ డెడ్‌లైన్..! మరో నెల రోజులు వెయిట్ చేస్తాం..!
మహనీయులు పట్ల మీకంటే మాకే గౌరవం ఎక్కువగా ఉందన్నారు కోలగట్ల.. మహనీయులకి మేం ఎంత గౌరవం ఇస్తున్నాం అనేది పట్టణం అంత కనిపిస్తుందన్నారు.. ఐస్ ఫ్యాక్టరీ జుంక్షన్ లో గాంధీ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడే బ్రాందీ షాప్ తీసేస్తాం అని చెప్పడం జరిగింది. ఇప్పటికే బ్రాందీ షాప్ వేరే చోటుకు మార్చేశాం అనే సంగతి కూడా మీకు తెలియకపోవడం విడ్డూరం అని మండిపడ్డారు.. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడకండి.. మీరు ఒక్కరే సమాజానికి మార్గదర్శకులు అయిన్నట్టు మాట్లాడవద్దు.. మీరు ఒక్కరే నిజాయితీ కాదు ఇక్కడ అందరం నిజాయితీ గానే సేవ చేస్తున్న విషయం గ్రహించాలని అని హితవుపలికారు.. ఇక, మీ హయంలో కంటే మా హయంలోనే విజయనగరం అభివృద్ధి అయ్యిందని.. ఆ విషయం అందరికీ తెలుసన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.