Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Off The Record Is Ashok Gajapati King In Power Is The Government Looking To Remove

TDP : అశోక్ గజపతి రాజుకి పదవి గండం పొంచి ఉందా..? ప్రభుత్వం తొలగించాలని చూస్తుందా..?

Updated On - 01:35 PM, Thu - 23 June 22
By Sista Madhuri
TDP : అశోక్ గజపతి రాజుకి పదవి గండం పొంచి ఉందా..? ప్రభుత్వం తొలగించాలని చూస్తుందా..?

సింహాచలం దేవస్ధానం ట్రస్ట్ బోర్డు వివాదం ఇప్పట్లో చల్లారేటట్టు కనిపించడం లేదు. కోర్టు నిర్ణయానికి అనుగుణంగా అనువంశిక ధర్మకర్త, చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు చేపట్టారు. ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఆహ్వానితులుగా అధికారపార్టీకి అనుకూలమైన వ్యక్తులు నామినేట్ అయ్యారు. పాలకమండలి కూర్పు ప్రభుత్వ నిర్ణయాధికారమే అయినప్పటికీ.. అది కొలువుతీరిన తీరు చర్చగా మారింది. చైర్మన్‌గా అశోక్ గజపతిరాజుకు ఆహ్వానం లేకుండానే అధికారులు కథ నడిపించేశారు. ఈ అంశాన్ని అశోక్‌ సీరియస్‌గా తీసుకుని న్యాయ సలహా కోరడంతో ట్రస్ట్ బోర్డు సమావేశంలో అధికారులు క్షమాపణ చెప్పారు. అయితే.. అసలు ఉద్దేశాలు వేరే ఉన్నాయని భావిస్తున్నారట అశోక్ గజపతిరాజు.

మాన్సాస్ ట్రస్ట్ భూముల వివాదంలోనే గతంలో అశోక్‌ను పదవీచ్యుతుణ్ణి చేసింది వైసీపీ సర్కార్. ఆ ప్లేస్‌లో వచ్చిన సంచయితా గజపతిరాజు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. అశోకే అనువంశిక ధర్మకర్తగా కోర్టు తేల్చడంతో సంచయిత కనిపించకుండా పోయారు. ఇక వివాదాలకు తావులేదని.. అంతా సింహాద్రి అప్పన్న సేవలో భాగం అవుతారని భావించారు. అయితే చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే ట్రస్టుబోర్డు చైర్మన్ పదవి నుంచి తనను తొలగించాలని ప్రభుత్వం ఎదురు చూస్తోందని అశోక్‌ చేసిన కామెంట్స్‌ చర్చగా మారాయి. లోగుట్టు ఆరా తీసే పనిలో పడ్డారు కొందరు.

సింహాచలం దేవస్ధానంలో పంచగ్రామాల భూ సమస్య జఠిలమైన వివాదం. సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం జరుగుతోంది. భీమిలి, పెందుర్తి, పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలతో ముడిపడి వున్న ఈ సమస్యను పరిష్కరిస్తామని గత ఎన్నికల సమయంలో వైసీపీ హామీ ఇచ్చింది. ఆ దిశగా కసరత్తు చేసినా పీఠముడులు వీడలేదు. పంచగ్రామాల పరిధిలో వేల మంది జీవిస్తుండగా.. దేవస్ధానం ఆంక్షలు కారణంగా అక్కడ ఇళ్లకు మరమ్మతులు లేవు. ఆ భూములు దేవస్థానం ఆస్తో.. తమ సొంతమో తేలక రైతులు నరకం అనుభవిస్తున్నారు. ఈ తరుణంలో పంచగ్రామాల్లో భూములను అనుభవదారులకు రెగ్యులరైజ్ చేసి.. ఆ మేరకు భూమిని ప్రత్యామ్నాయంగా దేవస్ధానానికి కేటాయించాలనే ప్రతిపాదన ఉంది. ఐతే, భూమికి భూమి బదలాయించడం వల్ల ఆలయానికి నష్టం వస్తుందనేది కొందరి వాదన. ప్రస్తుతం పంచగ్రామాల పరిధిలో గజం విలువ 20 వేల పైమాటే. అదే మార్కెట్ విలువ ఆధారంగా సింహాద్రి అప్పన్నకు భూముల కేటాయింపు జరగాలనేది ప్రతిపాదన. ఇది అమలు కావాలంటే ప్రభుత్వం సుమారు వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా ఎండోమెంట్ యాక్ట్ ఎంత వరకు సహకరిస్తుందో కూడా చూడాలనేది నిపుణుల మాట.

పంచగ్రామాల అంశంలో ముందడుగు పడాలంటే ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు నిర్ణయం కీలకం. ప్రభుత్వానికి ఆ విషయం తెలుసు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ధర్మకర్తల మండలి తీసుకోలేదన్నది అశోక్‌ మాట. అందుకే రిస్క్‌ తీసుకోలేనని ఆయన చెప్పేశారు. సభ్యుల ప్రతిపాదన పంపితే న్యాయపరమైన సలహాలు తీసుకుని.. చట్టబద్ధంగా ఉంటే ఆమోదించడానికి అభ్యంతరం లేదని ట్రస్ట్‌బోర్డుపై భారం పెట్టేసి చేతులు దులుపుకున్నారు. అయితే ట్రస్టుబోర్డు సభ్యులను తీర్మానం చేయాలని చెబుతూనే.. తనను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని.. అశోక్‌ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐతే, అశోక్ మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదంటున్నారు ట్రస్ట్ బోర్డు సభ్యులు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ప్రభుత్వ ఆలోచనలను, వ్యూహాలను పసిగట్టడంలో ఇప్పుడు అశోక్ గజపతిరాజు రెండు అడుగులు ముందే ఉన్నారట. వారసత్వం వివాదంలో సంచయిత తెరమరుగైన తర్వాత అందరి దృష్టీ ఆనంద గజపతిరాజు చిన్న కుమార్తె ఊర్మిళ గజపతిపైనే ఉంది. ట్రస్ట్ బోర్డు సమస్య వచ్చాక తమ అస్తిత్వం కాపాడుకోవడానికి ఆనంద్ కుటుంబం ప్రయత్నించింది. పూసపాటి సంస్ధానంలో తమ వారసత్వ హక్కులను గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ తరుణంలోనే ఇటీవల ఆసక్తికరమైన సీన్ కనిపించింది. కొన్నేళ్లుగా ఎవరికి వారుగా సింహాచలం చందనోత్సవం రోజు స్వామివారి దర్శనానికి వస్తున్న అశోక్, ఆనంద్ కుంటుబాలు ఈ ఏడాది కలిసి వచ్చాయి. దీంతో ప్రభుత్వం మరోసారి పదవీ గండం తీసుకుని వస్తే ధీటుగా ఎదుర్కోవడానికి అశోక్ గజపతిరాజు పూర్తి సన్నద్ధంగా ఉన్నారని అనుకుంటున్నారట. మరి.. రాజకీయ వైకుంఠ పాళీలో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.

 

 

  • Tags
  • Ashok Gajapathi raju
  • Simhachalam
  • simhachalam devasthanam
  • tdp
  • ycp

RELATED ARTICLES

Chandrababu : పోలీసులు ఇంతలా దిగజారి పోయారంటే ఆశ్చర్యంగా ఉంది

Atchannaidu : చర్యకు ప్రతిచర్య ఉంటుందని గుర్తు పెట్టుకోండి

BJP : ఏపీ బీజేపీ మాజీ చీఫ్ దారెటు.?కేడర్ ఆయనపై అసంతృప్తిగా ఉందా.?

TDP : ఆ మాజీ మంత్రి టైం చూసి పావులు కదుపుతున్నారా.? లేక స్పీడ్ పెంచారా.?

YCP: వైసీపీ దూకుడుకు ఆ.. జిల్లాలో సొంత నేతలే స్పీడ్ బ్రేకర్లుగా మారార..?

తాజావార్తలు

  • LIVE : Revanth Reddy Press Meet l NTV Live

  • LIVE : ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం…కోనసీమ జిల్లాలో 144 సెక్షన్ l AP Cabinet Key Decision

  • Viral Video: వెంటాడిన దురదృష్టం.. విచిత్రంగా అవుటైన న్యూజిలాండ్ క్రికెటర్

  • VL-SRSAM: సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ సక్సెస్

  • KTR: సీఎంతో చర్చిస్తా.. రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి చేస్తా

ట్రెండింగ్‌

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions