మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత సామాన్యుడిలా రైల్వే ప్లాట్ ఫాం మీద కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయనగరం రైలులో ప్రయాణించుటకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ అరుగు మీద కూర్చున్నారు. గతంలో కేంద్ర విమానయానశాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు రాజకుటుంబానికి చెందినవారు. అయితే సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన.. ఒక సామాన్య ప్రయాణికుడిలా రైల్వే స్టేషన్‌లో కనిపించారు. ఆయన కావాలనుకుంటే అధికారులే వచ్చి వీఐపీ గదిలో కూర్చోపెడతారు.. అంతేకాకుండా.. ఆయన అనుకుంటే ప్రత్యేక విమానంలో కూడా ప్రయనించవచ్చు. కానీ అవేమీ ఆయన కోరుకోరు. ఒక సామాన్యుడిలా అశోక్ గజపతిరాజు కుటుంబం రైలు ప్రయాణం చేయటం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోని టీడీపీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
Snoring: రాత్రిపూట గురకతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!
అశోక్ గజపతి రాజు రాష్ట్రమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ప్రభుత్వం కేటాయించిన వాహనంలో కాకుండా.. తన సొంత కారులోనే సచివాలయానికి వచ్చి వెళ్తుండే వారు. పదమూడేళ్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. వాణిజ్య పన్నులశాఖ, ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా ఆయన పనిచేశారు. మంత్రిగా పనిచేసినా.. పూసపాటి అశోక్ గజపతి రాజులో ఎటువంటి బేషజాలు కనిపించవు. ఆయన సాధారణ వ్యక్తిలాగానే ఉంటారు. అంతేకాకుండా.. వేల ఎకరాల భూములను సమాజ అభివృద్ధి కోసం పంచిపెట్టిన కుటుంబం ఆయనది.
Congress: రామమందిర కార్యక్రమానికి వెళ్లేది లేదన్న కాంగ్రెస్ పార్టీ.. “అది ఆర్ఎస్ఎస్/బీజేపీ ఈవెంట్”..
కాగా.. స్వతహాగా రాజు అయిన అశోక్ గజపతి రాజు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్లడానికి సామాన్యుడిలా రైల్వే స్టేషన్‌లో ఎదురుచూశారని టీడీపీ తెలిపింది. ఆయన నిజాయతీకి, పరిపూర్ణతకు ప్రతిరూపమని అభివర్ణించింది. ఎల్లప్పుడూ ప్రజలకు ఏది ఉత్తమమో అదే చేస్తుంటారని ప్రశంసించింది. అధికారం ఎప్పుడూ ఆయనను తప్పుదోవ పట్టించలేదని, తెలుగు దేశం అంటే ఇదని వ్యాఖ్యానించింది.