వారసులను జనాల్లోకి వదిలేందుకు విజయనగరం జిల్లాలోని సీనియర్ పొలిటీషియన్స్ వేయని ఎత్తుగడ లేదు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇలా పలువురు ప్రజాప్రతినిధులు.. తమ ఇంటి నుంచే భవిష్యత్‌లోనూ పొలిటికల్ యాక్టివిటీస్ కొనసాగాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో వారు చేపడుతున్న పనులు.. రచిస్తున్న వ్యూహాలు ఆసక్తిగా ఉంటున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్.. డాక్టర్. సందీప్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బొత్స పెద్ద…
టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. రామతీర్థం ఘటనకు సంబంధించి అశోక్ గజపతిరాజుపై నమోదైన కేసులో తదుపరి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో ఇటీవల జరిగిన కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. Read Also: తిరోగమనం వైపు పీఆర్సీ..! మళ్లీ ఉద్యమానికి ఉద్యోగ సంఘాలు రెడీ ఈ ఘటన నేపథ్యంలో అశోక్ గజపతిరాజుపై రామతీర్థం ఆలయ ఈవో ప్రసాద్‌రావు పోలీసులకు ఫిర్యాదు…
నాపై నమోదైన ఎఫ్ఐఆర్ పై హైకోర్టును ఆశ్రయించాను అని అశోక్ గజపతిరాజు తెలిపారు. నాపై నమోదు అయిన కేసులో పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న రామతీర్ధంలో ఎన్నడూ లేని ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో జరగటం బాధాకరం. దేవస్ధానంకి సమర్పించే కానుకలకు కూడా మంత్రులు అనుమతులు అడుగుతున్నారు. మంత్రులు నా కుటుంబం, నా సంస్కారం కోసం మాట్లాడుతున్నారు. నా కుటుంబం దేశద్రోహి కుటుంబం అంటున్నారు. నన్ను విమర్శించే వారిని వారి విజ్ఞతకే…
విజయనగరం రామతీర్థం బోడికొండపై జరిగిన పరిణామాలు చివరకు కేసుల వరకు వెళ్లాయి.. ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజుపై కేసు నమోదైంది.. 473, 353 సెక్షన్ల కింద అశోక్ గజపతిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. అయితే, ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అశోక్ గజపతి రాజు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఘటనలోకి టీడీపీ అధినేత చంద్రబాబును లాగడంపై అభ్యంతరం వ్యక్తం…
విజయనగరం రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్త నెలకొన్న సంగతి తెలిసిందే.. బోడికొండపై రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు మంత్రి వెల్లంపల్లికి మధ్య వాగ్వాదం జరగడం.. తనను కొబ్బరికాయ కూడా కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అశోక్ గజపతి రాజు అసహనం వ్యక్తం చేయడం, ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వీధి రౌడీల్లా అశోక్ గజపతిరాజుపై…
విజయనగరం రామతీర్థం బోడికొండపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామాలయ శంకుస్థాపన జరుగుతున్న సమయంలో ఆలయ ధర్మ కర్త అశోక్ గజపతిరాజుకు ఊహించని అవమానం జరిగింది. అశోక్ గజపతిరాజును కొబ్బరి కాయ కూడా మంత్రి వెల్లం పల్లి కొట్ట నివ్వకుండా రచ్చ చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన అశోక్ గజపతి రాజు… ఆందోళనకు దిగారు. శిలా ఫలకం బోర్డు ను తొలగించే ప్రయత్నం చేశారు పూసపాటి అశోక్ గజపతి రాజు. ఈ సందర్భంగా.. అశోక్ గజపతి రాజు…
ఆయనేమో అనువంశిక ధర్మకర్త. వాళ్లేమో అధికారులు. ఈ రెండు వ్యవస్థల మధ్య అనూహ్యమైన గ్యాప్ వచ్చింది. కారణాలేవైనా చైర్మన్‌కు ఎదురుపడేందుకే ఈవోలు సాహసించడం లేదు. దీంతో ధర్మకర్త దండం పుచ్చుకొనేందుకు సిద్ధమయ్యారట. ఇంతకీ ఆయన ఏం చేయబోతున్నారు? అశోక్‌తో మాట్లాడేందుకు ఈవోలు విముఖం! సింహాచలం దేవస్థానం ఛైర్మన్ పదవి చుట్టూ పెద్ద ధారావాహికమే నడుస్తోంది. ధర్మకర్త పదవి నుంచి అశోక్ గజపతిరాజును తప్పించిన ప్రభుత్వం.. ఆ ప్లేస్‌లో సంచయితను తెచ్చి పెట్టింది. ఆమె నియామకాన్ని సవాల్ చేసి..…
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది.. తాజాగా మరోసారి అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా తీర్పు వచ్చింది.. దీనిపై మీడియాతో మాట్లాడిన ఆయన.. మాన్సాన్ ట్రస్ట్ విషయంలో నా నియామకంపై హైకోర్టు మరోసారి అనుకూలంగా ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు.. వరసగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలినా బుద్ది రావడంలేదని మండిపడ్డారు.. కోర్టులో ప్రభుత్వానికి ప్రతిసారి చుక్కెదురవ్వడంపై ఆలోచించుకోవాలని సూచించిన ఆయన.. ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం మాన్సాస్ వ్యవహారంలో తలదూర్చిందన్నారు.. ఇష్టానుసారంగా నియామకాలు చేసి ట్రస్ట్…
మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో రోజుకో కొత్త ట్విస్ట్ అనే తరహాలో కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది… తాజా గా ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతి రాజు తనను ఛైర్మన్‌గా నియమించాలంటున్నారు.. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు ఊర్మిళ.. మొదటి భార్య కుమార్తె సంచయితను ఇటీవలే హైకోర్టు ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే కాగా.. తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం.. ఊర్మిళను, సంచయితను వారసులుగా గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు…
సింహాచలం భూముల అక్రమాల్లో టార్గెట్ ఫిక్స్ అయిందా? అశోక్ గజపతిరాజు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? త్వరలో కీలక పరిణామాలు ఉంటాయా? సూత్రధారులు.. పాత్రధారుల చిట్టా బయటపడుతోందా? అసలేం జరుగుతోంది? 700 ఎకరాలను ఆలయ రికార్డుల నుంచి తప్పించారా? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న సింహాచలం దేవస్థానం భూముల విషయంలో ఏం జరగబోతుందా అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం విచారణ చేపట్టింది. భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే రంగంలోకి దిగింది సర్కార్.…