ఇదిలా ఉంటే, తాజాగా అరుణాచల్ ప్రదేశ్ గురించి అడిగిన ప్రశ్నకు చైనా డీప్ సీక్ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించింది. భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని పలుమార్లు చైనా క్లెయిమ్ చేసింది. ఇది దక్షిణ టిబెట్‌లో అంతర్భాంగంగా డ్రాగన్ కంట్రీ పేర్కొంటోంది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి ఒక నిర్ధిష్ట ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి చైనీస్ చాట్‌బాట్ నిరాకరించింది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోడల్ విలేజ్‌లోని సెయింట్ అల్ఫోన్సా స్కూల్ ప్రాంగణంలో ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకు కూలింది. పాఠశాల సమయంలో వాటర్ ట్యాంక్ కూలడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్యాంపస్‌లో విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో ట్యాంక్ కూలడంతో సమీపంలోని గోడ కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగింది.
Attack In Hospital: రోజురోజుకి దేశంలో దాడుల ఘటనలు ఎక్కువతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లాలోని SEPA ఆసుపత్రిలో ఒక వ్యక్తి ప్రవేశించి అక్కడ ఉన్న వ్యక్తులపై దాడి చేయడంతో కలకలం రేగింది. అందిన సమాచారం ప్రకారం ఈ దాడిలో ముగ్గురు మరణించారు. అలాగే మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో దాడి చేసిన వ్యక్తి భార్య, అతని రెండేళ్ల కుమార్తె కూడా ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి…
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు కాన్ వాయ్ సన్‌పై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో తన కచేరీలో.. అతడు వేదికపై బహిరంగంగా కోడిని కత్తితో చంపేసి ఆపై దాని రక్తాన్ని పిండుకుని తాగాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు కేసు నమోదు చేశారు.
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 31న సైన్యంలో కలిసి చైనా సరిహద్దుల్లో దీపావళి వేడుకులు జరుపుకోనున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న సైనికులతో కలిసి పండగ చేసుకోనున్నారు. ఇటీవల సమయాల్లో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతం చైనా, ఇండియా మధ్య ఘర్షణ పాయింట్లలో ఒకటిగా ఉంది.
అరుణాచల్‌ప్రదేశ్‌లో 2014-2022 వరకు 21 మందిపై లైంగిక దాడికి పాల్పడిన హాస్టల్ వార్డెన్‌కు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి మరణశిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇదే కేసులో మాజీ ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
New Chinese Heliport: అరుణాచల్ ప్రదేశ్‌లోని సున్నితమైన 'ఫిష్‌టెయిల్స్' ప్రాంతానికి సమీపంలో వాస్తవ నియంత్రణ రేఖకు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో కొత్త హెలిపోర్ట్ ను డ్రాగన్ కంట్రీ నిర్మిస్తుంది. మారుమూల ప్రాంతంలోకి సైనికు వేగంగా తరలించే సామర్థ్యాన్ని చైనా సాయుధ దళాలు రెడీ చేసుకుంటున్నాయి.
Paper Leak Case : అరుణాచల్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్టుకు నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ కేసులో సీబీఐ మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సుబంసిరి జిల్లాలో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. నిందితులను అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.