అరుణాచల్ ప్రదేశ్ భారత ఉపఖండంలోని అత్యంత అందమైన రాష్ట్రాలలో ఒకటి. భారతదేశంలోని కొన్ని ప్రముఖ హిల్ స్టేషన్లు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అరుణాచల్ యొక్క ప్రధాన శిఖరం కాంగ్టో. ఈ శిఖరం సగటు సముద్ర మట్టానికి 7,060 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆహ్లదకరమైన వాతావరణాన్ని అనుభవించడానికి దాదాపు ఏడాది పొడవునా పర్యటకులు అరుణాచల్ ప్రదేశ్‌కు వస్తుంటారు. తాజాగా ఈ అందమైన ప్రదేశాన్ని వీక్షించేందుకు ఐఆర్‌సీటీసీ ఓ సువర్ణావకాశాన్ని అందించింది. అరుణాచలం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ గురించి సమాచారాన్ని తెలియజేస్తూ..ఐఆర్‌సీటీసీ ట్వీట్ చేసింది.
READ MORE: Hyderabad: రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు యువకులు మృతి
ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు…
ప్యాకేజీ పేరు- అరుణాచల్ ఎక్స్‌పెడిషన్ బై రైల్ ఎక్స్-ఎన్‌జెపి
ప్యాకేజీ వ్యవధి- 7 రాత్రులు, 8 రోజులు
ప్రయాణ విధానం- రైలు, రోడ్డు
ప్రాంతాలు- గౌహతి, తేజ్‌పూర్, కాజిరంగా, దిరాంగ్, తవాంగ్
READ MORE:Couple Suicide: ‘పిల్లలను బాగా చూసుకోలేకపోయాం..’ సూసైడ్ నోట్ రాసి దంపతులు ఆత్మహత్య
మీకు ఈ సౌకర్యం లభిస్తుంది..
1. ప్రయాణానికి రైలు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
2. బస చేయడానికి హోటల్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
3. ఈ టూర్ ప్యాకేజీలో అల్పాహారం,రాత్రి భోజనం అందుబాటులో ఉంటుంది.
4. మీరు ప్రయాణ బీమా సౌకర్యం కూడా పొందుతారు.
5. ఈ ట్రిప్‌లో మీరు ఒంటరిగా ప్రయాణించినట్లయితే.. రూ. 48,280 చెల్లించాలి.
6 . ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరికి రూ.36,740 చెల్లించాల్సి ఉంటుంది.
7. ముగ్గురైతే ఒక్కొక్కరికి రూ.34,310 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
8. పిల్లలకు ప్రత్యేక ఫీజు ఉంది. బెడ్‌తో కలిపి (5-11 ఏళ్లు) రూ.29,060 చెల్లించాల్సి ఉంటుంది.
READ MORE:Ayodhya Rape Case: 12 ఏళ్ల బాలిక కడుపులో 12 వారాల పాప..నిందితుడి ఇంటికి బుల్‌డోజర్!
ఎలా బుక్ చేయాలి..
ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీ కోసం బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, ఐఆర్‌సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.