India vs China: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో డ్రాగన్ కంట్రీ చైనా భారీ డ్యామ్ నిర్మిస్తోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డ్యామ్ నిర్మాణం వల్ల వరదలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ రాజధానిలో ఆదివారం ఉదయం మేఘాలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు వంటి పరిస్థితులు తలెత్తాయి.
Cloudburst: ఈశాన్య రాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. ‘‘క్లౌడ్ బరస్ట్’’ కారణంగా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో వరదలు పెరిగాయి. ఇటానగర్‌లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల ఆస్తి నష్టం జరిగింది. వరదల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
Pema Khandu: చైనా సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఈ రోజు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 60 సీట్లకు గానూ ఏకంగా 46 సీట్లను కైవసం చేసుకుంది.
Assembly Elections: హిమాలయ రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. అరణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం) మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 6 గంటలకే ప్రారంభమైన కౌంటింగ్.. ఇప్పటికే బీజేపీ సగం మార్కును దాటింది. ఈ క్రమంలో.. బీజేపీ సీఎం అభ్యర్థి పెమా ఖండూ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాగా.. రాష్ట్రంలోని 60 స్థానాల్లో 31 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా.. అధికార బీజేపీ ఇప్పటికే 10 అసెంబ్లీ స్థానాలను ఏకపక్షంగా గెలుచుకుంది. మిగతా 50 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది.
ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఉదయం ఆరు గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. కాగా.. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 స్థానాలుండగా.. ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలుపొందింది. మిగిలిన 50 స్థానాలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 133 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు ఇటీవల అంతర్రాష్ట్ర వ్యభిచార ముఠాను ఛేదించారు. 10 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల నలుగురు మైనర్ బాలికలను రక్షించారు. ఈ మేరకు ఓ సీనియర్ పోలీసు అధికారి శుక్రవారం వెల్లడించారు.