అరుణాచల్‌ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం అని.. విడదీయరాని భాగం అని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్‌ప్రదేశ్ మహిళను అదుపులోకి తీసుకోవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
గత ఢిల్లీ పాలకులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రధాని మోడీ విమర్శించారు. మోడీ సోమవారం అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇటానగర్ సభలో మోడీ ప్రసంగించారు.
ప్రధాని మోడీ సోమవారం రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రూ.5,100 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. జలవిద్యుత్, మౌలిక సదుపాయాలు, మాతా త్రిపుర సుందరి ఆలయ అభివృద్ధి సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
Arunachal CM: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్, భారతదేశానికి ఒక ‘‘వాటర్ బాంబ్’’ అని అరుణాచల్ సీఎం పెమా ఖండూ అన్నారు. ఇది అస్తిత్వ ముప్పు, సైనిక ముప్పు మాత్రమే కాకుండా, మరేదైనా పెద్ద సమస్యగా ఉంటుందని ఆయన అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Arunachal CM: అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాకు మింగుడు పడలేని వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి వచ్చాయి. అరుణాచల్‌కు చైనాతో సరిహద్దు లేదని, కేవలం టిబెట్‌తో మాత్రమే సరిహద్దు ఉందని అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణాచల్ ప్రదేశ్ చైనాతో 1200 కి.మీ సరిహద్దు పంచుకుంటుందని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అనగా, దీనికి పెమా ఖండు స్పందిస్తూ.. ‘‘నేను ఈ విషయంలో మిమ్మల్ని కరెక్ట్ చేయాలి, మేము చైనాతో కాదు…
India-China Conflict: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్నిప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై భారత్ తిరస్కరించింది. చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలను తాము గమనిస్తూనే ఉన్నామని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యనించింది.
ఎన్నికల పారదర్శకతపై పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ దేశంలోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలను డాటాను విశ్లేషించింది. మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేలలో 4,092 మంది అఫిడవిట్లను పరిశీలించింది. ఈ మేరకు ఓ నివేదిక తయారు చేసింది. గత ఐదు సంవత్సరాలలో వేరే పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి.. పార్టీ మారిన 63 మంది ఎమ్మెల్యేల జాబితా కూడా రూపొందించింది. ఎమ్మెల్యేల నేర నేపథ్యం, వారి ఆస్తుల వివరాల గురించి…
ఇదిలా ఉంటే, తాజాగా అరుణాచల్ ప్రదేశ్ గురించి అడిగిన ప్రశ్నకు చైనా డీప్ సీక్ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించింది. భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని పలుమార్లు చైనా క్లెయిమ్ చేసింది. ఇది దక్షిణ టిబెట్‌లో అంతర్భాంగంగా డ్రాగన్ కంట్రీ పేర్కొంటోంది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి ఒక నిర్ధిష్ట ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి చైనీస్ చాట్‌బాట్ నిరాకరించింది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మోడల్ విలేజ్‌లోని సెయింట్ అల్ఫోన్సా స్కూల్ ప్రాంగణంలో ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకు కూలింది. పాఠశాల సమయంలో వాటర్ ట్యాంక్ కూలడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్యాంపస్‌లో విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో ట్యాంక్ కూలడంతో సమీపంలోని గోడ కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగింది.
Attack In Hospital: రోజురోజుకి దేశంలో దాడుల ఘటనలు ఎక్కువతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లాలోని SEPA ఆసుపత్రిలో ఒక వ్యక్తి ప్రవేశించి అక్కడ ఉన్న వ్యక్తులపై దాడి చేయడంతో కలకలం రేగింది. అందిన సమాచారం ప్రకారం ఈ దాడిలో ముగ్గురు మరణించారు. అలాగే మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో దాడి చేసిన వ్యక్తి భార్య, అతని రెండేళ్ల కుమార్తె కూడా ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి…