Attack In Hospital: ఆసుపత్రిలో ప్రవేశించి విచక్షణారహితంగా దాడి.. ముగ్గురు మృతి.. ఆరుగురుకి గాయలు
- అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లాలోని SEPA ఆసుపత్రిలో..
- విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి..
- ముగ్గురు మృతి..
- ఆరుగురుకి గాయలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack In Hospital: రోజురోజుకి దేశంలో దాడుల ఘటనలు ఎక్కువతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లాలోని SEPA ఆసుపత్రిలో ఒక వ్యక్తి ప్రవేశించి అక్కడ ఉన్న వ్యక్తులపై దాడి చేయడంతో కలకలం రేగింది. అందిన సమాచారం ప్రకారం ఈ దాడిలో ముగ్గురు మరణించారు. అలాగే మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో దాడి చేసిన వ్యక్తి భార్య, అతని రెండేళ్ల కుమార్తె కూడా ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన ఆరుగురిలో ఒక పోలీసు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Koti Deepotsavam 2024: కార్తీక పూర్ణిమ శుభవేళ.. కోటి దీపోత్సవంలో ఏడవ రోజు కార్యక్రమాలు ఇవే!
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
నికమ్ సాంగ్‌బియా అనే వ్యక్తి ఉదయం 11.30 గంటలకు సెపా సివిల్ ఆసుపత్రిలోకి ప్రవేశించి విచక్షణారహితంగా ప్రజలపై దాడి చేయడం ప్రారంభించాడని తూర్పు కమెంగ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె సికోమ్ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిపై దాడికి పాల్పడిన వ్యక్తి మొదట దాడికి పాల్పడ్డాడని, ఆపై ఇతరులపై దాడి చేయడం ప్రారంభించాడని ఎస్పీ తెలిపారు. హత్యకు గురైన వారిలో దాడి చేసిన వ్యక్తి భార్య తాడే సాంగ్‌బియా, కుమార్తె నకియా సాంగ్‌బియా, మరోవ్యక్తి పసా వెలి కూడా ఉన్నారని ఆయన చెప్పారు. దాడి చేసిన వ్యక్తిని ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, పోలీసు అధికారి మిన్లీ గయి తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అతనికి మెరుగైన చికిత్స కోసం ఇటానగర్‌కు తరలించారు. అనంతరం దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతనిపై కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!