భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరో దుందుడుకు చర్యకు దిగింది. చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సరిహద్దులపై చైనా మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తమవేనంటూ.. వాటికి పేర్లను మారుస్తున్నట్లు వెల్లడించింది.
China : అరుణాచల్ ప్రదేశ్ తమ వాటాగా పేర్కొంటూ వస్తున్న నిరంతర ప్రకటనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం స్పందించింది. బీజింగ్ తన అసంబద్ధ వాదనలను ఎన్నిసార్లు పునరావృతం చేసినా, అరుణాచల్ ప్రదేశ్ మా భాగమేనన్న మా స్టాండ్‌ను మార్చుకోదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇదివరకు ఓసారి భారతదేశ భూభాగంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తమ దేశ భూభాగం అంటూ డ్రాగన్ దేశం చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అది సద్దుమనగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలనే చేసి కాస్త నోరు పెంచింది. అయితే దీనిని భారత్ హాస్యాస్పదమైనవంటూ భారత్ తోసిపుచ్చుతున్న.. కానీ చైనా ఏ మాత్రం తగ్గట్లేదు. ఇదివరకు జరిగిన సభలలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దీటుగా సమాధానం ఇచ్చిన నేపథ్యంలో చైనా మరోసారి ఈ విధంగా…
పాకిస్థాన్ ఒక పరిశ్రమగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఉగ్రవాద సమస్యను విస్మరించడానికి భారత్ ఏమాత్రం అనుకూలంగా లేదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం అన్నారు
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారత్‌లోఅంతర్భాభాగ మేనని అగ్రరాజ్య అమెరికా మరో సారి స్పష్టం చేసింది. అరుణాచల్‌ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని తెలిపింది.
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ తమ ప్రాంతమని డ్రాగన్ కంట్రీ చైనా చెబుతోంది. అయితే, ఎప్పటికప్పుడు చైనా వాదనల్ని భారత్ తిప్పికొడుతోంది. తాజాగా మరోసారి ఇండియాపై చైనా తన అక్కసు వెళ్లగక్కింది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరుణాచల్‌పై చేసిన వాదనల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది.
60 మంది సభ్యుల అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది. మొత్తం నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించనున్నారు.