సోషల్ మీడియా ద్వారా ప్రచారం త్వరగా చేయాలని భావిస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే టీవీ ఛానల్స్ కూడా తమ ఛానల్‌లోనే మొదటిసారి రావాలనే ఆతృతతో పూర్తిస్థాయిలో సమాచారం తెలుసుకోకుండానే వార్త కథనాలను కొన్ని సందర్భాల్లో ప్రసారం చేస్తుంటారు.
గత నెలలో హర్యానాలోని నుహ్ జిల్లాలో మతపరమైన ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. నుహ్‌లో జరిగిన మత ఘర్షణల ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలో జరగకుండా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఆదేశించింది.
సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాల్లో పార్టీకి సంబంధంలేనివారు కూడా వచ్చి పాల్గొంటూ ఉంటారు. కొన్ని సందర్భల్లో పార్టీ సమావేశాల్లోకి సైతం కొత్త వ్యక్తులు వస్తుంటారు. అలా వచ్చిన వారిని పార్టీ నేతలు గుర్తించి బయటకి పంపిస్తుంటారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. జులై 05న ఎమ్మెల్యే రఘునందన్ రావు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే జులై 04వ తేదీ మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో శివాజీ విగ్రహం దగ్గర ఘర్షణలు జరగడంతో అక్కడకు బయలుదేరారు.
వందే భారత్ రైలుపై రాళ్లదాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లను అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే
అతనో పోలీసు.. అతను డ్యూటీలో భాగంగా ఈ- చలాన్లు విధిస్తుంటారు. ఇలా చలాన్లు విధించగా వచ్చిన డబ్బులను వారు ప్రతి రోజూ బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా డిపాజిట్ చేసిన డబ్బుల్లో నుంచి పోలీసులకు అవసరమైన సమయంలో స్టేషనరీ ఇతర అవసరాలకు ఆ నిధులను ఉపయోగించుకుంటారు.
ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఇద్దరిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కలకలం రేపింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారు గోదావరిఖనిలోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారన్న సమాచారం అందుకున్న గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం మంగళవారం రాత్రి మహమ్మద్ జావిద్ తో పాటు అతని కూతురు ఖతిజాను అదుపులోకి తీసుకున్నారు.
Lover: ప్రతి ఒక్కరూ ప్రేమ కోసం, ప్రియురాలిని మెప్పించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తారు. తన వైపు తిప్పుకునేందుకు రకరకాల ట్రిక్కులు ఉపయోగిస్తుంటారు. అయితే ప్రియురాలిని తనవైపు తిప్పుకునేందుకు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు దొంగతనాలకు తెర తీశాడు.