Delhi: రీల్స్ చూసి బ్యాంకు ఉద్యోగిని దోచుకున్న విద్యార్థులు.. అరెస్టు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఈ మధ్య కాలంలో రీల్స్ చేయడం సర్వసాధారణంగా మారింది. వయస్సుతో సంబంధం లేకుండా.. వ్యక్తులతో సంబంధం లేకుండా రీల్స్ చేస్తున్నారు. అయితే రీల్స్ చేయడమే కాదు.. రీల్స్ చూసి ఈ మధ్య దొంగతనాలు కూడా చేస్తున్నారు. ఇలా రీల్స్ చూసి బ్యాంకులో దొంగతనం చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇలా రీల్స్ చూసి రాజధాని ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ పరిధిలోని బ్యాంకు ఉద్యోగిపై దోపిడీకి పాల్పడిన నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విద్యార్థులు తుపాకీతో బ్యాంకు ఉద్యోగిని బెదిరించి, నగదుతో పాటు ఒక ట్యాబ్లెట్ డివైజ్,ఇతర విలువైన సామగ్రి అపహరించుకుపోయారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి రూ.22,800 నగదు, ఒక ట్యాబ్లెట్ డివైజ్, లోన్‌ఫారాలు, ఒక బయోమెట్రిక్ స్కానర్ స్వాధీనం చేసుకున్నారు. వీరు బ్యాంకు ఉద్యోగిని బెదిరించేందుకు వినియోగించిన తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన విద్యార్థులంతా సోహనా ప్రాంతానికి చెందినవారని పోలీసులు గుర్తించారు.
Read also: Women Thieves: షిరిడీ రైలులో మహిళా దొంగలు.. బ్యాగులు మాయం చేసిన కిలేడీలు
Also Read
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
దొంగతనానికి పాల్పడిన విద్యార్థులను పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. జూలై 5న ఒక బ్యాంకు ఉద్యోగి సోహనా సిటీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను డీజీ గోయంకా యూనివర్శిటీ వెనుక రోడ్డులో వెళుతుండగా గుర్తుతెలియని యువకులు తుపాకీతో తనను బెదిరించి తన బ్యాగు లాక్కుపోయారని ఆరోపించారు. ఆ బ్యాగులో నగదు, ట్యాబ్లెట్ డివైజ్ మొదలైనవి ఉన్నాయని తెలిపారు. బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, సోహనాలో ఉంటున్న ఆ నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. ఆ తరువాత కోర్టుకు అప్పగించారు. ఈ విద్యార్థులంతా 19 నుంచి 22 సంవత్సరాల మధ్యవయసు కలిగినవారని, వీరంతా నేర పూరితమైన రీల్స్ చూస్తుంటారని.. వాటి ఆధారంగానే ఈ నేరానికి పాల్పడ్డారని పోలీసులు మీడియాకు తెలిపారు.
తాజావార్తలు
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?