NEET Case: నీట్ కేసులో మరో మెడికల్ విద్యార్థి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Case: నీట్ కేసులో మరో మెడికల్ విద్యార్థి అరెస్ట్ అయ్యాడు. నీట్ ఎగ్జామ్ రాకెట్ నడిపిస్తున్న మెడికల్ కాలేజీ విద్యార్థిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మెడికల్ కాలేజీ విద్యార్థి సంజూ యాదవ్‌ను అరెస్టు చేసిన ఒక నెల తర్వాత ఇప్పుడు ఈ రాకెట్ నడుపుతున్న మరో విద్యార్థిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)లో రిగ్గింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ మెడికల్ కాలేజీ విద్యార్థిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అదే కాలేజీకి చెందిన మరో విద్యార్థి సంజూ యాదవ్‌ను నెలక్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అసలు అభ్యర్థి స్థానంలో సంజూయాదవ్ నీట్ అభ్యర్థిగా హాజరయ్యాడు. దీంతో పరీక్షకు హాజరై దొరికి పోవడంతో అతన్ని అరెస్ట్ చేశారు. అతడిని అరెస్టు చేసిన ఒక నెల తర్వాత మరో అరెస్టు జరిగిందని పోలీసులు తెలిపారు. నిజమైన విద్యార్థులకు బదులుగా నీట్ పరీక్షలకు హాజరైన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) విద్యార్థులు నిర్వహిస్తున్న రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఎయిమ్స్‌లో బీఎస్సీ (రేడియాలజీ, ద్వితీయ సంవత్సరం) విద్యార్థి నరేష్ బిష్రోయ్ అనే ముఠా నాయకుడు సహా నలుగురు విద్యార్థులను పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు.
Read also: NCP Crisis: పవార్ వర్సెస్ పవార్.. పోటాపోటీగా విప్ జారీ చేసిన రెండు వర్గాలు..
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
మే నెలలో జరిగిన నీట్ ఎగ్జామ్ సమయంలో అసలు అభ్యర్థికి బదులు సంజూ యాదవ్ ఎగ్జామ్ రాయడానికి వచ్చాడు. అతడి బయోమెట్రిక్ సరిపోలకపోవడంతో అనుమానంతో యాదవ్‌ను అరెస్టు చేశారు. అనంతరం తనిఖీ చేయగా అతని ఐడి కార్డు, ఆధార్ కార్డుతో సహా అధికారిక పత్రాలు అన్నీ కూడా నకిలీవేనని తేలిందని పోలీసు అధికారి తెలిపారు. కేసు విచారణ సందర్భంగా కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న నరేష్ బిష్ణోయ్.. భారీ మొత్తంలో డబ్బు ఆశచూపి.. ఒకరికి బదులు మెడికల్ ప్రవేశ పరీక్షలో తాను పరీక్ష రాసేలా ఒప్పించాడని.. యాదవ్ వెల్లడించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. విచారణ అనంతరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిష్ణోయ్ ఒక్కో అభ్యర్థికి సుమారు రూ. 6 లక్షలు తీసుకున్నాడని తెలిపారు. నీట్ రాకెట్‌కు పాల్పడుతున్న అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని.. మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!