హైదరాబాద్ బేగం బజార్ పరువు హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య తర్వాత కర్నాటక పారిపోయిన నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. నీరజ్ పన్వార్ పరువు హత్య కేసులో అరెస్టైన మొత్తం నిందితుల సంఖ్య తొమ్మిదికి చేరింది ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్ పై కక్ష కట్టిన యువతి కుటుంబీకులు బేగం బజార్‌లో అత్యంత పాశవికంగా హతమార్చిన విషయం తెలిసిందే.. బేగంబజార్‌లోని షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చీ…
వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆలోచిస్తున్న ఇద్దరికి తెలుగులో వచ్చిన పుష్ప సినిమా కొత్త ఆలోచనకు ఉత్తేజపరిచింది. దీంతో శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనంను స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదించాలని రాయలసీమకు చెందిన అరటిపండ్ల వ్యాపారులిద్దరూ స్కెచ్ వేశారు. అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి, అరటిపండ్ల చాటున హైదరాబాద్‌కు తరలించి అడ్డంగా ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులకు పట్టుబడ్డారు. వీరివద్ద నుంచి రూ. 60.18 లక్షల విలువైన 1500 కిలోల ఎర్ర చందనం స్వాధీనం…
అమెరికాలోని ఓట్రక్ డ్రైవర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలో ఉంటూ భారత్‌లోని ఓ ఐపీఎస్ అధికారిణికే మెసేజ్‌లు పంపించాడు ప్రబుద్ధుడు. ఆమె కదలికలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూ వచ్చాడు. వాటి వివరాలను కూడా ఆమెకు మెసేజ్ చేసేవాడు. చివరకు ఆమెను కలిసేందుకు హైదరాబాద్ వచ్చి కటకటాలపాలయ్యాడు. ఇక వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన ఘల్ రాజు కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్న అతనికి గ్రీన్ కార్డు హోల్డర్ కూడా ఉంది. సోషల్…
తమిళ్ నిర్మాత వారాహి ని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నిరోజులుగా అతను ఒక మహిళను పెళ్లి చేసుకోమని వేధిస్తుండడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమిళనాడు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ లో పలు హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన వారాహి.. చెన్నై విరుగంబక్కం నటేసన్ నగర్‌లో ఉన్న బహుళ అంతస్థుల భవనంలో నివసిస్తున్నాడు. అదే ప్లాట్ లో ఉంటున్న రాణి (31) అనే మహిళను అతడు కొన్నిరోజులుగా ప్రేమించమని, వివాహం…
హైదరాబాద్ నగరంలో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. లోధా అపార్ట్మెంట్స్ లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 13 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో 13 మంది పేకాట ఆడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పోలీసులకు పట్టుబడిన వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు.…
గత వారం కర్మన్‌ఘాట్‌లో మత కలహాల సందర్భంగా పోలీసు సిబ్బందిపై దాడి చేసినందుకు ఆరుగురిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో గౌలిపురానికి చెందిన వ్యాపారి శివ చంద్ర గిరి (35), మీర్‌పేటకు చెందిన వ్యాపారి వర్ప లలిత్ చౌదరి (22), డిగ్రీ విద్యార్థి గొడవల శృతిక్ రెడ్డి (19), డిగ్రీ చదివిన మేడి అంకిత్ (20) ఉన్నారు. విద్యార్థి, అల్మాస్‌గూడ నివాసి, మేనేజ్‌మెంట్ కోర్సును అభ్యసిస్తున్న పి రాజ్ స్వీకృత్ రెడ్డి (19) బాలాపూర్‌లో…
స్మగ్లింగ్ చేసేందుకు కొత్తకొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. తీరా అధికారులకు దొరికి జైలుపాలవుతున్నారు. అయితే తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సొమాలీయన్ దేశానికి చెందిన మహమూద్ అలీ అనే వ్యక్తి షార్జా వెళ్లేందుకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్నాడు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా యూఎస్ డాలర్స్‌ను తన లగేజ్ బ్యాగ్‌లో దాచి తరలించేందుకు యత్నించాడు. అయితే మహమూద్ అలీపై అనుమానం వచ్చిన సీఐఎస్‌ఎఫ్ ఇంటలిజెన్స్ అధికారులు అతడితో…
జడ్జీలపై దూషణలు, అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. కొన్ని పోస్టులకు సంబంధించిన మూలాలను ఆధారంగా వెతుకుతున్న క్రమంలో డిజిటల్ కార్పొరేషన్‌లో డొంక కదిలినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాలలో అనుచిత వ్యాఖ్యల పోస్ట్ పెట్టిన కేసులో మరో ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం జడ్డీలను దూషించిన కేసులో సీబీఐ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జడ్జిలను దూషించిన కేసులో న్యాయవాది…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును పరామర్శించేందుకు సీఐడీ కార్యాలయానికి వచ్చిన దేవినేని ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. అశోక్‌బాబును కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో దేవినేని ఉమా వాగ్వాదానికి దిగారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దేవినేని ఉమా సహా టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్, పిల్లి మాణిక్యాలరావు,…
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ పోలీస్ అధికారిని అంటూ మోసాలు పాల్పడుతున్న అల్లం కిషన్ రావును (రిటైర్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్) అరెస్ట్ చేసినట్లు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ వెల్లడించారు. స్థల వివాదం పరిష్కరిస్తానని కరీంనగర్‌కు చెందిన అబ్బాస్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద 39 లక్షలు తీసుకొని బెదిరింపులకు పాల్పడ్డాడని, జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలోని స్థలాల వ్యవహారంలో కిషన్ రావు ఇన్వాల్వ్ అయ్యాడని ఏసీపీ తెలిపారు. బాధితుడు అబ్బాస్ రెండు రోజుల క్రితం…