నెల్లూరు జిల్లా కావలిలో ఆటోనగర్ డిపో ఆర్టీసీ డ్రైవర్ల పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి అని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు డిమాండ్ చేశారు. నిరంతరం రాత్రి పగలు ప్రయాణీకుల రవాణా సౌకర్యాన్ని అందించేందుకు విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై ఈ మధ్య దాడులు పెరగడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.
టీడీపీ మాజీమంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తి అరెస్టుపై ఉత్కంఠ.. అర్ధరాత్రి తర్వాత పరవాడ మండలం వెన్నెల పాలెంలో భారీగా మోహరించిన పోలీసులు.. బండారు ఇంటికి వెళ్లే మార్గాలు మూసివేత.. ఇటీవల మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బండారు..
Atrocious: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 7 ఏళ్ల అమాయక బాలికపై అత్యాచారం చేసి దారుణంగా గొంతుకోసి హత్య చేశారు. చిన్నపిల్లపై అఘ్యాయిత్యాలు ఆగడం లేదు.
ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతనిని అరెస్టు చేశారు. ముంబై-గౌహతి విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చంద్రబాబు అరెస్ట్ పై టీటీడీ పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు తెలిసింది వెన్నుపోటు, పన్ను పోటు అని ఆరోపించారు.
జగన్ 16 నెలలు జైల్లో ఉండటం వలన కక్ష సాధింపు చర్యలతో అక్రమ అరెస్ట్ చేయించారని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడుని పది నిమిషాలు అయినా సరే జైల్లో పెట్టాలని ఉద్దేశంతో అరెస్ట్ చేశారని తెలిపారు.
చంద్రబాబు అరెస్ట్ పై ఉదయం నుంచి వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబును సీఐడీ ప్రశ్నిస్తుంది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే అరెస్టయ్యాడని, అవినీతికి పాల్పడిన వ్యక్తిని జైలుకు పంపించకుండా ఎక్కడకు పంపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ సంతోషంగా ఉంటుందన్నారు. ‘పిచ్చోడు లండన్‌కి… మంచోడు జైలుకి… ఇది కదా…
పాకిస్థాన్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కరాచీలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ మహిళా టీచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఒక్కరా ఇద్దరా అని కాదు.. ఏకంగా 45 మంది మహిళా టీచర్లపై లైంగింకంగా వేధించాడని అక్కడి పోలీసులు తెలిపారు.
హైదరాబాదలో మత్తు పదార్ధాలు అమ్ముతున్న వారిపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పాతబస్తీలోని బహదూర్ పురా పొలీసులు గంజాయి అమ్ముతున్న ఇద్దరీతో పాటు గంజాయి కొని, సేవించే వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు.