Karnataka Assembly: సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాల్లో పార్టీకి సంబంధంలేనివారు కూడా వచ్చి పాల్గొంటూ ఉంటారు. కొన్ని సందర్భల్లో పార్టీ సమావేశాల్లోకి సైతం కొత్త వ్యక్తులు వస్తుంటారు. అలా వచ్చిన వారిని పార్టీ నేతలు గుర్తించి బయటకి పంపిస్తుంటారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాల్లో కొత్త వ్యక్తులు పాల్గొన్నారంటే సరి.. కానీ రాష్ట్ర అసెంబ్లీలోకి.. అదీ ఎకంగా ఎమ్మెల్యే సీట్లోనే కొత్త వ్యక్తి.. ఎమ్మెల్యే కానీ వ్యక్తి కూర్చుంటే ఎలా ఉంటుంది. ఇది సాధ్యం అవుతదా? అనే సందేహం కలుగుతుంది కదా? కానీ ఇది జరిగింది. కర్ణాటక అసెంబ్లీలో శుక్రవారం ఇటువంటి ఘటన జరిగింది. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు.. అజ్ఞాత వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశారు.
Read also: PM MODI: వరంగల్‌లో ప్రధాని మోడీ సభ.. పరిసర ప్రాంతాల్లో డ్రోన్ లపై నిషేధం
సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యే.. కట్టుదిట్టమైన భద్రత వుండే అసెంబ్లీలో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఓ అజ్ఞాత వ్యక్తి లోపలికి ప్రవేశించి.. ఏకంగా శాసనసభ్యుడి సీట్లో కూర్చొన్నాడు. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక అసెంబ్లీలో జరిగింది. శుక్రవారం కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్న సమయంలో విధాన సౌధలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి జేడీఎస్ ఎమ్మెల్యే కరియమ్మకు కేటాయించిన కుర్చీలో కూర్చొన్నాడు. అసెంబ్లీలో అపరిచిత వ్యక్తిని గుర్తించిన జేడీఎస్ ఎమ్మెల్యే వెంటనే స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీని అప్రమత్తం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అతను ఎమ్మెల్యే కాదని గుర్తించిన పోలీసులు .. కాసేపటికీ తేరుకుని ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతను అనుమతి లేకుండా అసెంబ్లీలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వ్యక్తికి 70 ఏళ్లు వుంటాయని సమాచారం. అసెంబ్లీ నుంచి ఈ వ్యక్తిని బయటకు పంపేందుకు భద్రతా అధికారులను లోపలికి ప్రవేశించారు. తాజా ఘటన కర్ణాటక అసెంబ్లీలో భద్రతా ఏర్పాట్లపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఘటన జరిగిన రెండు గంటల తర్వాత అధికారులు విచారణ చేపట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 14వ సారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డుల్లోకెక్కారు. అంతేకాదు.. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్.