Man Bit SI's Ear : కేరళలో రోడ్డు ప్రమాదం చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులకు చేదు ఘటన ఎదురైంది. తప్పతాగి రోడ్డుపై ప్రయాణిస్తూ ప్రమాదానికి కారణమయ్యాడని ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Vijay Zol: టీమిండియా అండర్-19 మాజీ కెప్టెన్ విజయ్ జోల్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో 19మందిపై కిడ్నాప్, దోపిడి, అల్లర్లకు పాల్పడ్డారన్న కారణంతో కేసు నమోదైంది. క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు విజయ్, అతడి సోదరుడు విక్రమ్‌తో పాటు మొత్తం 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తన కొడుకు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టాడు కానీ ఎలాంటి తప్పు పని చేయలేదని విజయ్ తండ్రి, సీనియర్ క్రిమినల్ లాయర్…
తమిళనాడు తంజావూరు జిల్లాలో ప్రముఖ ఆలయాల్లో వరుస చోరీలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పురాతన విగ్రహాల అపహరణ పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో అక్కడ శరవణన్ అనే స్వామీజీని కలిస్తే విగ్రహాల దొంగతనాలు పరిష్కారం అవుతుందని ప్రజలు చెప్పడంతో చిన ఆలయ నిర్వహకులు శరవణన్ అనే స్వామిజిని ఆశ్రయించారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం సంగీతం గ్రామంలో నాటు తుపాకుల కలకలం రేపాయి. సంతోష్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలకు వెళ్లారు.
హాలీవుడ్ డైరెక్టర్ పాల్ హగ్గిస్ పేరు ఫిలిమ్ బఫ్స్ కు సుపరిచితమే! ఆయన రచనతో తెరకెక్కిన ‘మిలియన్ డాలర్ బేబీ’, ‘క్రాష్’ చిత్రాలు ఆస్కార్ ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. ‘క్రాష్’ ద్వారా ఆయనకు నిర్మాతగా, రచయితగా కూడా ఆస్కార్ అవార్డులు లభించాయి. 69 ఏళ్ళ హగ్గిస్ ను ఇప్పటికీ కొందరు రొమాంటిక్ అంటూ కీర్తిస్తుంటారు. అందులో నిజానిజాలు ఏమో కానీ, ఓ రేప్ కేసులో హగ్గిస్ ను ఇటలీ పోలీసులు ఆదివారం (జూన్ 19న) అదుపులోకి తీసుకున్నారు.…
యాదాద్రి జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యాదగిరిగుట్టలో ఆటో కార్మికులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. తెల్లవారుజాము నుంచే ఆటో కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొండపైకి ఆటోలను నిషేధించడంతో ఇవాళ ఆటో సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కొండపైకి ఆటోలను నిషేధించడంతో.. జీవనోపాధి కోల్పోయామని ఆటో కార్మికుల ఆందోళన వ్యక్తం చేశారు. కొండపైకి ఆటోలను అనుమతించాలని ఆటో కార్మికుల డిమాండ్ చేశారు. అయితే.. 2022 మార్చి 31న యాదాద్రి…