Pre-Installed Apps: స్మార్ట్ ఫోన్ల విషయంలో కేంద్రం కీలక చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. స్మార్ట్ ఫోన్లలో ముందగానే ఇన్ బిల్ట్ గా ఉంటున్న ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. భద్రతా పరంగా సమస్యలు తలెత్తె అవకాశం ఉండటంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గూఢచర్యం, యూజర్ డేటా దుర్వినియోగం గురించి ఆందోళన నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ కొత్త నిబంధనలను పరిశీలిస్తోంది.
కొత్తగా ప్రతిపాదిస్తున్న నిబంధనల ప్రకారం ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తొలగించి, ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లను తప్పనిసరి చేసేలా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలను ఆదేశించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా ఉన్న భారత్ సెక్యూరిటీ విషయంలో రాజీ పడటం లేదు. అయితే ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తొలగిస్తే స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది
Read Also: Pidamarthi Ravi: వెన్నుపోటు పొడవడం సండ్రకు అలవాటే.. బీఅర్ ఎస్ లో ఉంటారనే గ్యారెంటీ లేదు
గూఢచర్యం, వినియోగదారుల డేటా దుర్వినియోగం గురించి ఆందోళనల నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ కొత్త నిబంధనలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ఓ అధికారి వెల్లడించినట్లుగా సమాచారం. ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు సెక్యూరిటీ సమస్యలకు కేంద్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. టిక్‌టాక్‌తో సహా 300 కంటే ఎక్కువ చైనీస్ యాప్‌లను 2020లో కేంద్రం నిషేధించింది. చైనీస్ వ్యాపారాలపై నిఘా ఎక్కువ చేసింది. చైనా కంపెనీలు అయిన హువాయ్ వంటి సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గూఢచర్యానికి పాల్పడే అవకాశం ఉందని అనేక దేశాలు ఆంక్షలు విధించాయి.
షియోమి సంస్థ గెట్ యాప్స్, సామ్ సంగ్ సామ్ సంగ్ పే, ఐఫోన్లలో సఫారీ బ్రౌజర్ల వంటివి ముందే డిలీట్ చేయని విధంగా ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌లతో వస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం స్మార్ట్ ఫోన్ తయారీదారులు తమ కొత్త మోడళ్లలో అన్ ఇన్ స్టాల్ చేసే విధంగా ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత మార్కెట్ లో చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. షియోమీ, వివో, ఒప్పో అమ్మకాలు సగం వాటాను కలిగి ఉన్నాయి. శాంసంగ్ 20 శాతం, యాపిల్ 3 శాతం వాటాను కలిగి ఉన్నాయి.