ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ ఐఫోన్, ఉత్పత్తులపై భారతీయుల క్రేజ్ అందరికీ తెలిసిందే. దేశంలో కంపెనీ అమ్మకాలు పెరగడానికి అదే కారణమని చెప్పవచ్చు. యాపిల్ తన మొట్టమొదటి రిటైల్ స్టోర్‌ను భారతదేశంలో త్వరలో ప్రారంభించనుంది. దేశంలో ఐఫోన్‌ల తయారీని వేగంగా విస్తరిస్తున్న యాపిల్ తన రిటైల్ స్టోరీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. బుధవారం తన స్టోర్ చిత్రాన్ని విడుదల చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మొదటి స్టోర్‌ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే, లాంచ్ తేదీ ఇంకా వెల్లడించలేదు.
Also Read: Samantha: నీ కష్టాలకు కన్నీళ్లు పెట్టగలమే కానీ నీ కర్మను పంచుకోలేం
ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్‌లో ఉంటుంది. ముకేశ్ అంబానీకి చెందిన బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో యాపిల్ స్టోర్ ఉండనుంది. ఇక, యాపిల్ ఢిల్లీలో రెండవ రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చింది. స్మార్ట్‌ఫోన్‌ల కోసం దేశంలో పెరుగుతున్న మార్కెట్‌పై కంపెనీ ఆసక్తిని గుర్తించడమే కాకుండా ఆపిల్ వినియోగదారులకు మెరుగైన సేవలకు హామీ ఇస్తుంది. ఈ దుకాణాలు కేవలం ఉత్పత్తులను విక్రయించడానికి మాత్రమే కాకుండా Apple ఈవెంట్‌లను హోస్ట్ చేయడానికి కూడా నిర్మించబడ్డాయి.
Also Read:Hanuman Jayanti : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
Apple ఉత్పత్తులు భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రమే లభిస్తున్నాయి. ఆపిల్‌కు ప్రపంచంలో దాదాపు 700 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఐఫోన్‌లతో సహా Apple కేటలాగ్‌లోని కొన్ని ఉత్పత్తులను తైవాన్ కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారులు ఫాక్స్‌కాన్, విస్ట్రోన్ కార్ప్ భారతదేశంలో అసెంబుల్ చేశాయి.