Oil giant Saudi Aramco: కనీవినీ ఎరగని రీతిలో లాభాలను సొంతం చేసుకున్న సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oil giant Saudi Aramco: అంతర్జాతీయంగా పేరొందిన సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ సంస్థ.. ఆరామ్‌కో.. ఇంతకుముందు ఎన్నడూలేనంతగా గొప్పగా రాణించింది. గతేడాది ఏకంగా 13 పాయింట్ రెండూ సున్నా లక్షల కోట్ల రూపాయలకు పైగా లాభాలను ఆర్జించింది. తద్వారా.. తన రికార్డులను తానే తిరగరాసుకుంది. అంతేకాదు.. యాపిల్, వొడాఫోన్ వంటి పెద్ద పెద్ద కంపెనీలతోపాటు ఎక్సాన్ మొబిల్, షెల్ తదితర అమెరికా సంస్థలు 2022లో నమోదుచేసిన ప్రాఫిట్స్‌ని అధిగమించింది.
read more: Beer: జపాన్ బ్యాంక్ నుంచి ఫండ్‌రైజ్ చేసిన ‘బిరా 91’
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
ఈ నేపథ్యంలో మార్కెట్ వ్యాల్యూపరంగా ఆరామ్‌కో కంపెనీ.. ప్రపంచంలోనే 2వ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. ఆరామ్‌కో కన్నా ముందు యాపిల్ కంపెనీ ఒక్కటి మాత్రమే ఉండటం విశేషం. ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో చమురు నిల్వలు భూమి పైపొరల్లోనే ఉండటం వల్ల అక్కడ ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో ముడి చమురును వెలికితీయొచ్చు.
ఫలితంగా ఆ దేశానికి ఏటా లాభాలు పెరుగుతున్నాయి. దీనికితోడు.. ఏడాది కాలంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా నుంచి క్రూడాయిల్ కొనొద్దంటూ పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించటం సౌదీ అరేబియాకి పరోక్షంగా కలిసొచ్చింది. మరోవైపు.. చమురు ధరలు విపరీతంగా పెరిగాయి.
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా సైతం కొవిడ్ ఆంక్షలను తొలగించటంతో ఆయిల్‌కి డిమాండ్ భారీగా పెరిగింది. ఇదే అదునుగా సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని పెంచింది. ఇవన్నీ ఇన్‌డైరెక్ట్‌గా ప్లస్ అయ్యాయి. ఆరామ్‌కో సంస్థ 2020లో 49 బిలియన్ డాలర్ల లాభాన్ని మాత్రమే సొంతం చేసుకోగా 2021లో దానికి రెట్టింపు కన్నా ఎక్కువ లాభాలను.. అంటే.. 110 బిలియన్ డాలర్ల ప్రాఫిట్స్ పొందింది.
2022లో కనీవినీ ఎరగతి రీతిలో 161 బిలియన్ డాలర్ల లాభాలను మూటగట్టుకుంది. అయితే.. ఈవిధంగా.. శిలాజ ఇంధనాల వాడకాన్ని విపరీతంగా పెంచటం ద్వారా వాతావరణ కాలుష్యానికి కారణమవుతోందనే విమర్శలను ఆరామ్‌కో కంపెనీ ఎదుర్కొంటోంది.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు