ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలకు హాజరయ్యేందుకు డెడ్ లైన్ 9.45 కావటంతో.. పరీక్షా కేంద్రాల వద్ద గేట్లకు సిబ్బంది తాళాలు వేశారు. ఇదే సమయంలో విజయవాడ నలంద విద్యా నికేతన్‌లోని గ్రూప్-2 పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా దివ్యాంగుడైన అభ్యర్ధి వచ్చారు. అయితే తన భర్త దివ్యాంగుడు కావటంతో పరీక్షకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని అతడి భార్య ప్రాధేయ పడింది. దీంతో దివ్యాంగునికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు హాజరయ్యేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు.…
బర్డ్ ఫ్లూ భయంతో సండే చికెన్ సేల్స్ కుదేలైపోయాయి. కేజీ 30 రూపాయలు తగ్గించి అమ్మినా.. కొనే దిక్కులేదు. అదే సమయంలో మటన్ 1000 రూపాయలు మార్క్ దాటేస్తే.. ఫిష్ 200 రూపాయలకు పైనే పలుకుతోంది. వైరస్ భయం మనసులో పెట్టుకుని.. చికెన్ తినడం రిస్కే అంటున్నారు జనాలు. అటు బిర్యానీ పాయింట్లు, హోటళ్లలో 40 శాతం అమ్మకాలు పడిపోయాయి. దాంతో వ్యాపారాలు లబోదిబో అంటున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో నాటు కోళ్ల కొనుగోలుకు బారులు తీరారు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు గ్రూప్-2 ప్రధాన పరీక్ష జరగనుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. టైం దాటితే లోపలకు అనుమతించేది లేదని ఏపీపీఎస్సీ స్పష్టం…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జలాలను ఏపీ దోపిడీ చేస్తుందని రేవంత్‌రెడ్డి అనడం దారుణం అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు
ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పన్నును ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చాక... చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ట్వీట్ వ్యవహారం వివాదంగా మారింది. ‘కష్టపడి సాధించే విజయానికి గౌరవం’ అంటూ ట్వీట్ చేసిన వర్మ.. కాసేపటికే డిలీట్ చేశారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వర్మ జనసేన జెండాలతో ప్రచారం చేసిన వీడియో షేర్ చేశారు. అయితే ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. కేవలం పవన్ గెలుపు కోసం వర్మ చేసిన ప్రచారం మాత్రమే ఉంది. అయితే వర్మ కాసేపటికి ట్వీట్…
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరామమన్నారు. మిర్చికి రూ.11,600 పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. మార్కెట్ రేటుకు, రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్‌ను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆదుకోవాలని చూస్తున్నాం అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర…
మిర్చి రైతులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శిస్తే తప్పేంటి? అని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, జగన్ ప్రజల్లో తిరగకుండా చేసేందుకు భద్రత కుదించారన్నారు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు భద్రత కల్పించలేమని చంద్రబాబు చెప్పడం దుర్మార్గం అని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వెంకటరామి రెడ్డి ఫైర్ అయ్యారు. తాజాగా గుంటూరు మిర్చి యార్డుకు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళా స్నానం వీడియోను సోషల్ మీడియాలో తప్పుగా చూపించడంపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో జనసైనికులు కంప్లైంట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులపై BNS సెక్షన్లు 353(2), 356(2) కింద క్రైమ్ నంబర్లు 11, 12, 13, 14లలో సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీ అడ్రస్ ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుంభమేళాలో పవిత్రస్నానం చేసిన పవన్ కళ్యాణ్…
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో నాటు కోళ్లకు బర్డ్ ప్లూ సోకింది. సుమారు 95 గ్రామాలలో బర్డ్ ఫ్లూతో నాటు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత 15 రోజుల నుంచి నాటుకోళ్లు బర్డ్ ప్లూతో పిట్టల్లా రాలిపోతున్నాయి. కోళ్లు చనిపోవడంతో నాటుకోళ్ల పెంపకం దారులకు లక్షల్లో నష్టం వాటిల్లుతుంది. దీంతో నాటుకోళ్ల వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మొన్నటివరకు ఫారం, బ్రాయిలర్ కోళ్లకు వైరస్ సోకి మృతి చెందాయని ఆందోళన పడుతుంటే.. ఇప్పుడు బర్డ్ ఫ్లూ…