AP Legislators Sports Meet: లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం.. బహుమతులు ప్రదానం చేయనున్న సీఎం!
- నేడు బెజవాడలో సీఎం చంద్రబాబు పర్యటన
- ఏపీ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం
- శాప్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు బెజవాడలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఏపీ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంకు సీఎంతో పాటు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నారు. స్పోర్ట్స్ మీట్‌లో విజేతలకు చంద్రబాబు బహుమతులు అందించనున్నారు. సాయంత్రం 4:30 గంటల నుంచి లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం ఆరంభం కానుంది. ఏపీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ మీట్ నేటితో ముగియనుంది.
లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో కళాకారులు పలు కళాకృతులు ప్రదర్శించనున్నారు. సంస్కృతిక కార్యక్రమాలలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు భాగం పంచుకోనున్నారు. సీఎం చంద్రబాబు నేడు క్రీడలు ఆడే అవకాశం ఉంది. ‘ఇవాళ సాయంత్రం విజయవాడలో సభ్యులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సీఎం చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరు అవుతారు. క్రీడా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ఈరోజు తెలిపారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ ఫుల్ చిల్.. ఒక్క రాత్రికి రూ.23 లక్షలు!
శాప్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు 13 రకాల ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్, క్రికెట్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, వాలీబాల్, త్రోబాల్, కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్నాయి. ఈ క్రీడల కోసం రిఫరీలు, అంపైర్లు, సహాయకులు.. మొత్తంగా 200 మంది సిబ్బందిని నియమించారు. అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలుగా ఉండగా.. క్రీడా పోటీల్లో పాల్గొనడానికి 140 మంది పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మండలిలో 58 మంది ఎమ్మెల్సీలు ఉండగా..13 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రతిరోజు అసెంబ్లీ, మండలి సమావేశాలు ముగిశాక స్టేడియంలో పోటీలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!