AP Assembly 2025: ప్రజల చేత ఎన్నికై దొంగలా రావడం ఏంటి?.. సభ్యులపై స్పీకర్ అసహనం!
- ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ అసహనం
- సభకు డుమ్మా కొట్టడంపై స్పీకర్ అసంతృప్తి
- సంతకాలుంటున్నాయి కానీ సభలో సభ్యులు ఉండరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల నిర్వహణలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. సభ్యులు ప్రశ్నలు అడిగి సభకు డుమ్మా కొట్టడంపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నలు అడిగిన వారు సభకు రాకపోవడం వలన మరో ఇద్దరు మాట్లాడే అవకాశం కోల్పోతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ రిజిస్టర్లలో సంతకాలు ఉంటునాయి కానీ.. సభలో సదరు సభ్యులు కనిపించడం లేదని స్పీకర్ పేర్కొన్నారు. ప్రజల చేత ఎన్నికై దొంగలా రావడం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Rajasthan Royals Captain: రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
Also Read
‘కొంతమంది సభ్యులు సభకు రావడం లేదు. మరి కొందరు సభ్యులు దొంగల్లా వచ్చి రిజిస్టర్లలో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారు. ప్రజల చేత ఎన్నికై దొంగలా రావడం ఎందుకు. ప్రశ్నలు అడుగుతున్నారు సభలో ఉండడం లేదు. హజరు పట్టికలో సంతకాలు చేసి సభకు రాకపోవడం వారి గౌరవాన్ని పెంచదు. వై బాల నాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాధ రెడ్డి, విశ్వేశరరాజులు ఇలా సంతకాలు చేసి వెళ్లిపోతున్నారు. గవర్నర్ ప్రసంగం తరువాత వేర్వేరు రోజుల్లో వీరు సంతకాలు చేసి వెళ్లినట్టు తెలుస్తోంది. మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని కోరుతున్నాం’ అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?