జమ్మలమడుగు వైసీపీలో నేతల మధ్య పంచాయితీ మళ్లీ మొదటికొచ్చిందా? పార్టీ పెద్దల సంతృప్తి కోసమే చేతులు కలిపారా? నాయకుల మధ్య వైరం అలాగే ఉందా? కొత్త రగడ పార్టీలో కాక రేపుతోందా? ఆ ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కష్టమేనా? లెట్స్ వాచ్! ఇద్దరి మధ్య సఖ్యత కష్టమేనా? కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రమైన జమ్మలమడుగులో 2019 ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు జరిగాయి. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీని వైసీపీలో చేరిన తర్వాత నియోజకవర్గంపై…
కుప్పంలో టెన్షన్ వాతారవరణం నెలకొంది. కుప్పంలో ఇవాళ శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ర్యాలీకి పిలుపునిచారు బలిజ సామాజిక వర్గం నేతలు. కానీ ఆ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పోలీసులు అడ్డుకున్నా ర్యాలీ నిర్వహించి తీరుతామని బలిజ సామాజిక వర్గ పెద్దలు ప్రకటించారు. దాంతో గత రాత్రి నుంచి ముఖ్య నేతలను ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఉంచిన శ్రీ మంజునాథ రెసిడెన్సి వద్ద 50 మందికి పైగా పోలీసులను మోహరించారు.…
ఏపీ సీఎంవోలో కీలక పాత్ర పోషిస్తోన్న ఆయనకు కత్తెర పడింది. ముఖ్యమైన బాధ్యతల నుంచి తప్పించారు. తిరుగే లేదని అనుకున్న IAS విషయంలో సడెన్‌గా ఈ ట్విస్ట్ ఏంటి? ఎందుకు కోత పెట్టారు? అధికారుల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? ఇంతకీ ఎవరా అధికారి? లెట్స్ వాచ్! ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్‌పై అధికారుల్లో చర్చ ప్రవీణ్ ప్రకాష్. రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో మిగిలిన ఐఏఎస్సుల్లాగానే ఈయనా ఓ ఐఏఎస్. కాకపోతే సీఎంవోలో పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే…
పవర్ పోవడంతో.. ఢీలాపడ్డ ఆయనకు గట్టిగానే ఎదురు దెబ్బలు తగిలాయి. రానురానూ వాటికి అలవాటు పడిపోయారో ఏమో.. ఎవరైనా తమ బాధలు చెబితే.. వెయిట్ ప్లీజ్ అంటున్నారట. మన టైమ్ వచ్చే వరకూ ఓపిక పట్టాలని ప్రవచనాలు ఇస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా హితోక్తులు? అచ్చెన్న మాటల్లో దూకుడు లేదా? ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి తాజా వైఖరి తెలుగు తమ్ముళ్లను ఆశ్చర్య పరుస్తోంది. అధికారంలో ఉన్నా.. విపక్షంలోకి జారినా మొన్నటి వరకు దూకుడుగా…
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలో నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 36,750 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 7,063 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 809.60 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 34.1004 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమగట్టు…
ఏపీలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి… రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,526 మంది పాజిటివ్‌గా నమోదు కాగా… మరో 16 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 3001 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,31,555 కు చేరుకోగా.. రికవరీ కేసులు 18,96,499 కు పెరిగాయి.. read also : ఆహాలో హారర్ వెబ్ సీరిస్ ‘అన్యాస్ ట్యూటోరియల్’ ఇక, ఇప్పటి…
నెల్లూరు జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జిందాల్ స్టీల్ ప్లాంటుకు 860 ఎకరాల కేటాయించారు. నెల్లూరు జిల్లా తమ్మినపట్నం- మోమిడి గ్రామాల పరిధిలో జిందాల్ స్టీల్ ప్లాంటుకు భూమి ఇచ్చారు. గతంలో కిన్నెటా పవర్ కు ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు చేసి.. జిందాల్ స్టీల్సుకు కేటాయించారు. రూ. 7500 కోట్ల రూపాయలతో 11.6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయనుంది జిందాల్ స్టీల్స్. 2500 మందికి నేరుగా, మరో 15…
ఎగువ నుండి కూడా వరద రాకపోవడంతో శ్రీశైలం జలాశయంకి వచ్చిన వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో నిల్ గా ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 7,063 క్యూసెక్కులుగా ఉంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 807.30 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 32.7417 టీఎంసీలు ఉంది. ఇక ప్రస్తుతం ఎడమ గట్టు జల…