టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం ముగిసింది. తిరుమలను కాలుష్య రహిత క్షేత్రంగా మార్చేందుకు 35 ఎలక్ట్రికల్ వాహనాలను డ్రైలీజ్ కు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 2022 సంవత్సరానికి సంబంధించి త్రిదండి చినజీయర్ స్వామి ప్రతిపాదనలకు సంబంధించి 10 ఆలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు నుండి రూ.9 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటి వరకు రూ.150 కోట్లు విరాళంగా అందింది. శ్రీవాణి ట్రస్టు దర్శనాలకు వీఐపీ బ్రేక్ దర్శనాల్లో ప్రియారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈఓ జవహార్ రెడ్డి తెలిపారు.
అలాగే బర్డ్ ఆసుపత్రి పాత భవనంలో చిన్న పిల్లల ఆసుపత్రికి సంబంధించి రూ.6 కోట్లతో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయలని పేర్కొనగా… టీటీడీలో భద్రత మరింత పటిష్టం చేసేందుకు రూ.2 కోట్లతో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. రూ.4.27 కోట్లతో 22 స్కానర్లు ఏర్పాటు చేయాలని… శ్రీవారి నైవేధ్యానికి స్వచ్ఛమైన ప్రకృతాసిద్ధమైన నెయ్యిని వినియోగించాలని నిర్ణయించాం అన్నారు. దీనికి సంబంధించి 25 గిర్ గోవులను విరాళంగా అందించారు
అలాగే స్వామివారి నైవేద్యానికి కావాల్సిన నెయ్యి తయారు చేయడానికి 1200 లీటర్ల పాలు అవసరమవుతాయి. స్వామివారి ప్రసాదానికి వినియోగించే నెయ్యి తయారీలో భక్తులను భాగస్వామ్యం చేసేందుకు నవనీత సేవ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛమైన నెయ్యి విరాళమివ్వాలనే భక్తుల కోసం నెయ్యిదానం కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నాం. గోసంరక్షణపై చిత్తశుద్ధితో పని చేసే కుటుంబాలను తీసుకొచ్చి టీటీడీలో గోసంరక్షణలో భాగస్వామ్యం చేస్తాం. టీటీడీ అవసరాలకు తగిన విధంగా గోఆధారిత వ్యవసాయం ప్రొత్సాహించేందుకు కడప, కర్నూలు రైతులతో సమావేశమవుతాం ఇక ఇప్పట్లో శ్రీవారి దర్శనాల సంఖ్యను పెంచం అని స్పష్టం చేసారు.