పప్పు చెప్పిన మాటలకు ఏం స్పందిస్తాం… ఎవరి పాదం మంచిదో రాష్ట్రంలో అందరికీ తెలుసు అని ఏపీ ఇరిగేషన్ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన… జగన్ పాదం వల్ల రాష్ట్రంలో డ్యాములు, రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. అన్నమయ్య గేటు ఎత్తుకుని పోయిన విషయం ట్వీట్ చేసిన వ్యక్తి కి తెలియదా… చంద్రబాబు పాదం పడగానే గోదావరి లో 35 మంది చనిపోయారు. పులిచింతల గేటు కొట్టుకుపోవటం వల్ల నష్టం ఏమీ లేదు. డ్యామును మళ్లీ పూర్తి స్థాయిలో నింపుతాం. లోకేష్ తెలిసీ తెలియని అజ్ఞాని అని పేర్కొన్నారు. 2015 సరిగా లేదని నివేదిక పై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదు. వాళ్ళు కోర్టుకు వెళితే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు రిట్ ఫైల్ చేయలేదు… వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తి అనే వదిలేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అయితే హైడ్రాలిక్ గేట్లు పెట్టే అవకాశాన్ని పరిశీలించమని సీఎం చెప్పారు అని తెలిపారు.