విశాఖ:- రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కోసం సాయంత్రం విశాఖకు రానున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక ఈ పర్యటనలో రేపు శ్రీకాకుళం జిల్లా పొందురులో నేషనల్ హ్యాండ్లూమ్ డే వేడుకల్లో పాల్గొనున్నారు ఆర్ధిక మంత్రి. రేపు సాయంత్రం విశాఖ పెడవాల్తేరులో వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించనున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా. ఆదివారం కృష్ణదేవిపేటలో అల్లూరి సమాధులను సందర్శించనున్న నిర్మల సీతారామన్…75ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా అల్లూరి ఘాట్ ను సందర్శించనున్నారు. ఇక ఆదివారం సాయంత్రం తాళ్ల పాలెం దగ్గర రేషన్ డిపో సందర్శించనున్నారు. అనంతరం తిరిగి ఢిల్లీ కి వెళ్లనున్నారు.