నేటి సింహాచలం గిరి ప్రదక్షిణ రద్దు చేశారు. కోవిడ్ అంక్షలు, నైట్ కర్ఫ్యూతో ముందే ప్రకటించింది దేవస్థానం. భక్తులు గిరి ప్రదక్షిణ చేయకుండా గోశాల, పాత అడివివరం కూడళ్ల దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. రేపు ఆషాఢ పౌర్ణమికి సింహ గిరిపై పటిష్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. పెద్ద సంఖ్యలో అప్పన్న స్వామి దర్శనానికి భక్తులు తరలిరానుండటంతో మూడు వీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసారు. రేపు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు…
ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 86,280 సాంపిల్స్ పరీక్షించగా.. 2,527 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 19 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,412 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,46,749 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,09,613 కి చేరింది..…
శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద నీరు తగ్గుతుంది. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో ఎగువ నుండి వచ్చిన వరద కారణంగా పెరిగిన ఇన్ ఫ్లో ఇప్పుడు తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 45,111 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 28,252 క్యూసెక్కులు గానే ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 842.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం…
కోవిడ్ థర్డ్ వేవ్ రావటం ఖాయం అని కోవిడ్ టెక్నికల్ కమిటీ ఛైర్మన్ డా. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన కొద్ది వారాల్లోనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో అందరికీ వ్యాక్సిన్ వేసిన తర్వాతే వైరస్ తగ్గిందని చెప్పొచ్చు ఇప్పుడు తీటా, ఎప్సెలా అనే వెరియంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ కనిపిస్తోంది. విశాఖ, విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం…
కోవిడ్ కారణంగా మార్పులు చేసిన ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి జిల్లా కార్యాలయాలు ఇతర ఉపకార్యాలయాలు ఉదయం 10.30 గంటల నుంచి ఐదు గంటల వరకూ పనిచేస్తాయని స్ఫష్టం చేసింది జగన్ ప్రభుత్వం. సచివాలయంతో పాటు విభాగాధిపతులు, ఇతర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పనిచేస్తాయని స్పష్టం చేశారు. read also : రేపే టీఆర్ఎస్లో చేరుతున్నా : కౌశిక్…
విపక్షంలో ఉన్న పార్టీ పుంజుకోవాలంటే నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలి.. కానీ, బెజవాడ టిడిపిలో ఇది రివర్స్ లో ఉందట.. అసెంబ్లీ ఎన్నికల టైంలోనే మొదలైన కలహాలు ఇంకా కొనసాగుతున్నాయట.. ఎవరి దారి వారిదే అన్నట్టు సాగుతున్నారట. నేతల మధ్య పోరుతో కేడర్ అయోమయంలో పడుతోందట.. బెజవాడ టిడిపిలో కలహాల కాపురం సాగుతోంది. నేతల మధ్య లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో మొదలైన కలహాలు కార్పొరేషన్ ఎన్నికల నాటికి రచ్చకెక్కాయి. గతంలో అధికారంలో ఉన్న…
నిన్న తిరుమల శ్రీవారిని 17073 మంది భక్తులు దర్శించుకోగా 8488 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 1.7 కోట్లు. అయితే నేటి నుండి ఆన్ లైన్ లో ఆగష్టు మాసంకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల టీటీడీ విడుదల చేయనుంది. రోజుకి 5 వేల చోప్పున టీటీడీ టికెట్లను విడుదల చేయనుంది. అయితే ఏపీలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టిన దర్శనాల టికెట్ల సంఖ్యను మాత్రం టీటీడీ పెంచలేదు. ఇక…
శ్రీశైలం జలాశయానికి వరద వరద ఉధృతి పెరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి ఎక్కువ నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,64,645 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 28,252 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 833.40 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 53.1795 టీఎంసీలు ఉంది.…
నామినేటెడ్ పోస్టుల పందేరం ముగియడంతో ఎమ్మెల్యేల ఫోకస్.. కేబినెట్ బెర్త్‌లపై పడింది. రెండున్నరేళ్ల ప్రక్షాళన గడువు దగ్గర పడేకొద్దీ.. తాడేపల్లి వైపు ఆశగా చూస్తున్నారు. కేబినెట్లో ఉన్నవారు టెన్షన్ పడుతుంటే.. కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారు ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఈ అంశమే హాట్ టాపిక్. తాడేపల్లి వైపు ఆశగా చూస్తోన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 స్థానాల్లో 13 చోట్ల గెలిచింది వైసీపీ. ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. ఇద్దరికి జిల్లా…