అసని తుఫాన్ మీద సీఎం జగన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలపై సమీక్ష జరిపిన ఆయన.. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో అలెర్ట్గా ఉండాలని.. తుఫాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని సూచించారు. తుఫాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని చెప్పిన సీఎం జగన్.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.…
విశాఖలోని రుషికొండ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రుషికొండలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీచేసింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఎన్జీటీ ఈ ఆదేశాలిచ్చింది. ఇప్పటివరకు జరిగిన తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని నియమించింది. దీనికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏపీ కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీని నియామకం చేసింది ఎన్జీటీ. నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఎన్జీటీ ఆదేశాలు…
విభజన కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో సమస్యలు, వివాదాలు తలెత్తుతూనే వున్నాయి. కృష్ణా నదిపై ఏర్పాటైన వివిధ జలాశయాల విషయంలో ఈ ఇబ్బందులు మరీ ఎక్కువనే చెప్పాలి. రెండురాష్ట్రాల మధ్య కేంద్రం పెద్దన్న పాత్రను పోషిస్తూనే వుంది. వివిధ కారణాల వల్ల కేఆర్ఎంబీ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒకటి హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో ఈమధ్య జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై…
‘అసని’ తీవ్ర తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ క్రమంగా తీరాన్ని సమీపిస్తోంది. కాకినాడ తీరం వద్ద తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. యానాం-కాకినాడ తీరాన్ని తాకిన తర్వాత మళ్లీ తుఫాన్ సముద్రంలోకి వెళ్లనుంది అసని తుఫాన్. దీంతో ఏపీలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రస్తుతం కాకినాడకు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా అసని తుఫాన్ గమనాన్ని బట్టి ముందుగా అది ఏపీ తీరాన్ని…
https://www.youtube.com/watch?v=JnbsscOPBUU బుధవారం ఏ రాశివారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయి…? ఏ రాశివారు.. ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది..? ఎవరు తమ పనులు వాయిదా వేసుకోవాలి…? ఎవరు ముందుకు వెళ్లాలి..? ఇలాంటి పూర్తి వివరాలతో కూడిన రాశిఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
ఏపీలో ఇంటర్ పరీక్ష వాయిదా పడ్డాయి. రేపు (మే 11) జరగాల్సిన ఇంటర్ పరీక్షని ఈనెల 25కి వాయిదా వేసినట్టు అధికారులు వేసినట్టు తెలిపారు. అసని తుఫాన్ కారణంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు బోర్డ్ ప్రకటించింది. కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాన్ తీవ్రరూపం దాల్చి తీరం వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, కాకినాడకి 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను కారణంగా ఈ రోజు రాత్రి…
బంగాళాఖాతంలో అసని తుఫాన్ అలజడి రేపుతోంది. తీరం వైపు పయణిస్తోంది. తీరం వైపు గంటలకు 6 కిలోమీటర్ల వేగంతో పయణిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తుఫాన్ కాకినాడకు 330 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. అసని తుఫాన్ కారణంగా విశాఖలో వాతావరణం మారిపోయింది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా ఉంది. తీరం వెంబడి గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే విశాఖ వ్యాప్తంగా…
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి లో జరిగిన కాల్పుల ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు ఉపయోగించిన గన్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన నెల్లూరు జిల్లా కాల్పుల ఘటనలో నిందితుడు సురేష్ రెడ్డికి గన్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని సురేష్ రెడ్డి ఇంతటి దారుణానికి ఒడి గట్టడం వెనుక ఎవరిదైనా ప్రోత్సాహం..ఉందా…
కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుడు మరణించడంతో దశదిన కర్మలో భాగంగా అంగడి దింపుడు కార్యక్రమానికి ఎల్లారెడ్డి పట్టణం సంతకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంతో పాటు మరో 14మంది గాయపడ్డారు.…