https://www.youtube.com/watch?v=eOAEUkF05dc సోమవారం ఏ రాశివారు ఏం చేయాలి? ఏ కార్యక్రమాలు చేస్తే ఫలితాలు ఎలా వుంటాయి. ద్వాదశ రాశులకు సంబంధించి గ్రహచారం, మంచీచెడు గురించి శ్రీరాయప్రోలు మల్లిఖార్జున శర్మ రాశిఫలాలు అందిస్తారు. ఆ రాశిఫలాలు ఎలా వున్నాయో ఈ వీడియోలో చూద్దాం.
అసలే గర్భిణి. నిత్యం మద్యం సేవించి వేధించే భర్త..బిడ్డ కోసం అన్నీ భరించాలనుకున్నా వీలు కాలేదు. అమ్మగారి ఇంటికి వెళ్లాలని నడక మొదలుపెట్టిందా యువతి.తిరుపతి నుంచి రెండు రోజుల పాటు నడిచి 65 కిలోమీటర్ల దూరంలోని నాయుడు పేటకు చేరుకుంది. స్థానికుల సహకారంతో బిడ్డకు జన్మనిచ్చింది. రాజమహేంద్రవరంలోని వై.ఎస్.ఆర్.నగర్ కు చెందిన వర్షిణి దంపతులు పొట్టకూటి కోసం తిరుపతికి వెళ్లారు. నిత్యం భర్త మద్యం సేవించి వేధిస్తుండటంతో వర్షిణి తట్టుకోలేక పోయింది. నిండు చూలాలు కావడంతో తనను…
తిరుమలలో స్వధర్మ వాహిని ట్రస్ట్ లోగో ఆవిష్కరించారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ. తెలుగు రాష్ర్టాలలో హిందూ ధార్మిక ప్రచారానికి కొత్త ఒరవడి సృష్టించాలన్నారు స్వామీజీ. తెలుగు రాష్ర్టాలలోని హరిజన,గిరిజన వాడలలో హిందూ ధార్మిక ప్రచారాన్ని గట్టిగా నిర్వహించాలన్నారు. హరిజన, గిరిజన వాడలలో ఇతర మతస్థులు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. స్వధర్మ వాహిని ద్వారా తెలుగు రాష్ర్టాలలో….అటు తరువాత దక్షిణాది రాష్ట్రాలలో హిందూ ధార్మిక ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు స్వరూపానంద స్వామీజీ. టీటీడీకి విశాఖ పీఠానికి…
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో పెద్దేరు నది ప్రవాహం పైన బ్రిడ్జి పాడైంది. ఒకవైపు అసనీ తుఫాన్ ప్రభావం వల్ల, గతంలో నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరగడం వల్ల అధిక బరువు గ్రానైట్ లారీలు ప్రయాణం చేయడం వల్ల బ్రిడ్జి కుంగిన విషయం తెలిసిందే. శరవేగంగా కుంగిన వంతెన శ్లాబ్ తొలగింపు పనులు సాగుతున్నాయి. వంతెన కుంగిపోవడంతో అధికారులు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో పలు ప్రాంతాలకు చెందిన వాహనదారులు…
కిచెన్లో ఉల్లిపాయలు, టమోటా లేకుంటే రోజు గడవదు. ఉల్లిపాయలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. కిలో 20 రూపాయల లోపే లభిస్తున్నాయి. ఇక నిత్యం కూరల్లో వాడే టమోటా ధర మాత్రం ఆకాశానికి చేరింది. అక్కడినించి దిగనంటోంది. తిరుపతిలో మరింతగా పెరిగింది టమోటా ధర. మదనపల్లె మార్కెట్లో రూ.70కి చేరింది కేజీ టమోటా ధర. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా వినియోగదారులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు టమోటాల వినియోగం ఎక్కువగా వుంటుంది.…
కాకినాడలో ఎస్సై గోపాలకృష్ణ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అధికారు వేధింపులు, అవమానాల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల్ని కూడా మాట్లాడనివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించడం పలు అనుమానాలకు తావిస్తోందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఎస్సై ముప్పవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య మొత్తం పోలీసు శాఖకే అవమానం. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో ఉన్న కులవివక్షకు ఇదొక నిదర్శనం…
https://www.youtube.com/watch?v=u1ixNl-A5hQ ఆదివారం ఏ రాశివారు ఏం చేయాలి? ఏ కార్యక్రమాలు చేస్తే ఫలితాలు ఎలా వుంటాయి. ద్వాదశ రాశులకు సంబంధించి గ్రహచారం, మంచీచెడు గురించి శ్రీరాయప్రోలు మల్లిఖార్జున శర్మ రాశిఫలాలు అందిస్తారు. ఆ రాశిఫలాలు ఎలా వున్నాయో ఈ వీడియోలో చూద్దాం.
అయాచితంగా ఓనేతపై చేసిన విమర్శలకు కొంత కాలంగా ఆయన ఫలితం అనుభవిస్తున్నాడు. అత్యంత సౌమ్యుడు… వివాదరహితుడుగా పేరుపొందిన ఆ విద్యావేత్తను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. వదల బొమ్మాలి అన్న రీతి లో సదరు నేత వెంటపడుతుండడం ఇబ్బందికరంగా మారింది. భూ వివాదాలు… రాజకీయంగానే కాకుండా వ్యాపార లావాదేవీల అంతు తేలుస్తా అంటూ బహిరంగ ప్రకటనలు చేయడం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అనంతపురం జిల్లా టీడీపీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి మధ్య ముదిరిన వివాదం…