https://www.youtube.com/watch?v=HsGrjepw3Vw
ప్రముఖ మీడియా సంస్థ NTV ఛైర్మన్ శ్రీ తుమ్మల నరేంద్ర చౌదరి గారికి విశ్వహిందు పురస్కార ప్రదానం జరిగింది. అవధూత దత్తపీఠం, మైసూరువారు ఈ పురస్కార ప్రదానం చేశారు. సనాతన ధర్మాన్ని వ్యాప్తిచేసే విశిష్ట వ్యక్తులకు దత్తపీఠం అందించే అరుదైన పురస్కారం విశ్వహిందు పురస్కారం.
గత 15 సంవత్సరాలుగా సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న భక్తి టీవీ కృషిని యావత్ దేశం గుర్తించింది. ప్రశంసలు కురిపిస్తోంది. దక్షిణాదిలో నెం. 1 ఆధ్యాత్మిక ఛానల్ గా భక్తి టీవీ అఖండ ప్రస్థానం కొనసాగుతోంది. ఏటా కార్తీక మాసంలో భక్తిటీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం యావత్ దేశ, విదేశాల్లోని భక్తులకు చిరపరిచితం. ఎన్ని ఆటంకాలు వచ్చినా కోటిదీపోత్సవం జరిగే అన్నిరోజులూ ప్రతిరోజూ కోటిదీపోత్సవం నిర్వహిస్తోంది. ప్రతిరోజూ లక్షలాదిమంది భక్తుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తూ… ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూనే వుంది. హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడే వ్యక్తుల్ని గుర్తించి వారి విశేషంగా సత్కరిస్తోంది భక్తి టీవీ.

భక్తిటీవీ కోటిదీపోత్సవంలో శ్రీ నరేంద్ర చౌదరి దంపతులు
సాక్షాత్తూ భగవంతుడే భువికి దిగివచ్చాడా అనే రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం ఈ విశేష కార్యక్రమానికి వేదిక అవుతోంది.ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నారు ఎన్టీవీ ఛైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి.శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 80వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు NTV చైర్మన్ నరేంద్రచౌదరి దంపతులు.