https://www.youtube.com/watch?v=u1ixNl-A5hQ ఆదివారం ఏ రాశివారు ఏం చేయాలి? ఏ కార్యక్రమాలు చేస్తే ఫలితాలు ఎలా వుంటాయి. ద్వాదశ రాశులకు సంబంధించి గ్రహచారం, మంచీచెడు గురించి శ్రీరాయప్రోలు మల్లిఖార్జున శర్మ రాశిఫలాలు అందిస్తారు. ఆ రాశిఫలాలు ఎలా వున్నాయో ఈ వీడియోలో చూద్దాం.
అయాచితంగా ఓనేతపై చేసిన విమర్శలకు కొంత కాలంగా ఆయన ఫలితం అనుభవిస్తున్నాడు. అత్యంత సౌమ్యుడు… వివాదరహితుడుగా పేరుపొందిన ఆ విద్యావేత్తను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. వదల బొమ్మాలి అన్న రీతి లో సదరు నేత వెంటపడుతుండడం ఇబ్బందికరంగా మారింది. భూ వివాదాలు… రాజకీయంగానే కాకుండా వ్యాపార లావాదేవీల అంతు తేలుస్తా అంటూ బహిరంగ ప్రకటనలు చేయడం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అనంతపురం జిల్లా టీడీపీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి మధ్య ముదిరిన వివాదం…
జీడీసీసీ బ్యాంకులో పెద్దఎత్తున అక్రమాలు జరిగిన దృష్ట్యా తక్షణమే ఆ సంస్థ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, సీఈవో కృష్ణవేణిలను పదవుల నుంచి తొలగించాలని సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డితో సమావేశం అయ్యారు. జీడీసీసీ బ్యాంకులో జరుగుతున్న అక్రమాలను నివేదించారు. వీరితో పాటు మొత్తం పాలకవర్గాన్ని రద్దు చేయాలన్నారు. ఇప్పటివరకు జరిగిన అక్రమాల్లో బ్యాంకుతో పాటు రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉందన్నారు. రూ.కోట్లలో బ్యాంకు సొమ్ము…
*ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి తిరుమల పర్యటన. ఇవాళ శ్రీకాళహస్తీర్వుడి దర్శనం, తిరుపతి గంగమ్మకు సారెని సమర్పించనున్న స్వామీజీ. * నేడు రాయలసీమ యూనివర్శిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కు పిలుపు. రాయలసీమ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆనందరావు ను రీకాల్ చేయాలని డిమాండ్ *నేడు రాజ్ భవన్ ను ముట్టడించనున్న రాయలసీమ విద్యార్థి సంఘాలు. అనుమతులు లేవు ఆంక్షలు అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తాం…
ఇవాళ నృసింహ జయంతి సందర్భంగా ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీరు అన్నీ శుభాలను పొందుతారు. నిత్యం మీలో ఏర్పడే సంఘర్షణకు ముగింపు లభిస్తుంది. మీ కుటుంబం సుఖసంతోషాలతో వుంటారు. https://www.youtube.com/watch?v=3LfIHZ3P75g
కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్‌తో ఆయన కాల్చుకు బలవన్మరణానికి పాల్పడినట్టు చెబుతున్నారు. అధికారులు మాత్రం.. మిస్ ఫైర్ జరిగి ఎస్సై మృతి చెందారని చెబుతున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు తర్వాతే ఎస్సైది ఆత్మహత్యనా? మిస్ ఫైర్ జరిగి మృతి చెందారా? అనేది తేలుతుందని అంటున్నారు. ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య…
సమాజంలో అడుగడుగునా మోసాలు జరుగుతున్నాయి. భర్త బతికుండగానే మరణించినట్లు వార్డు సచివాలయ సిబ్బంది, రెవిన్యూ అధికారులతో కలిసి ఓ మహిళా వాలంటీర్ మోసానికి తెగబడింది. ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులో నుండి తన భర్త పేరున తొలగించిన సంఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన బళ్లారి సుభాహాన్ బాషా గత రెండు ఏళ్ల కిత్రం రాయచోటి పట్టణం కొత్తపల్లెకు చెందిన ఓ మహిళను…
అడవుల్లో వుండాల్సిన వన్యప్రాణులు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు రోడ్లమీదకు, జనం మీదకు వచ్చేస్తున్నాయి. దీంతో జనం కంటిమీద కునుకులేకుండా గడపాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గురువారం రాత్రి ఎలుగుబంటి హల్ చల్ చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయ పరిసరాలతో పాటు ప్రక్కన నున్న అపార్టుమెంటు ప్రాంగణంలోకి చొరబడి కాసేపు చక్కర్లు కొట్టింది. తమ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తుందని తెలుసుకున్న స్థానికులు భయాందోళన చెందారు. కాసేపు ఆ ప్రాంతంలో తచ్చాడిన ఆడిన…