డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వార్తల్లో వుంటారు. తాజాగా ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ చీటింగ్ కేసు నమోదైంది. గతంలో శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర వర్మ 56 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఈ విషయంలో డబ్బులు తిరిగి ఇవ్వక పోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని శేఖర్ రాజు కోర్టును ఆశ్రయించాడు.
అతనిపైన నేడు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దిశ సినిమా నిర్మించేందుకు గాను 56 లక్షలు తీసుకున్న రామ్ గోపాల్ వర్మ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడంతో ఫిర్యాదు చేశానని శేఖర్ రాజు పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం 406, 417, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు.దీనిపై వర్మ ఏమంటారో చూడాలి.
Pawan Kalyan: రేణుదేశాయ్‌ను కలిసిన పవన్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్