వేసవి సెలవులు నడుస్తుండడంతో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు కీలక సూచనలు అందించారు. భక్తుల రద్దీ కారణంగా దర్శనాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలను అందిస్తున్నామని, స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఆహారం, తాగేందుకు నీరు అందిస్తున్నామన్నారు.…
* ఐపీఎల్ 2022: రసవత్తరంగా మారిన ఐపీఎల్ పోరు. ఫైనల్ లో తలపడనున్న రాజస్థాన్-గుజరాత్. ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న గుజరాత్ టైటాన్స్. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ * అనంతపురంలో సామాజిక న్యాయ భేరీ కార్యక్రమంలో భాగంగా వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ముగింపు సభ. 1700 మంది పోలీసులతో భారీ బందోబస్తు. *నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర. నంద్యాల నుంచి బయల్దేరి కర్నూలు చేరుకోనున్న…
https://www.youtube.com/watch?v=9PVGS8VluRE ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయి..? ఏ రాశివారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది..? ఏ రాశివారు కొత్త పనులు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుంది..? ఏ రాశివారు కొత్త పనులు వాయిదా వేసుకుంటే మంచిది.. ఎవరు ఈ రోజు ఎలాంటి పూజలు చేయాలి లాంటి పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
ఈరోజుల్లో ఆస్తి తర్వాతే ఏదైనా. ఓ కొడుకు ఆస్తి కోసం ఎంతకైనా తెగించాడు. చిత్తూరు జిల్లా పీలేరులో ఆస్తి కోసం కన్న తండ్రికి నరకం చూపించాడు. ఆస్తి కోసం కన్న తండ్రి చంద్ర శేఖర్ రెడ్డిని హతమార్చ ప్రయత్నం చేసిన కొడుకు కథ ఇది. అతను రిటైర్డ్ ఆర్మీ జవాన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి కావడంతో సమాజం నివ్వెరపోయింది. ఈనెల 23 తేదీన బైక్ పై వెళుతున్న తండ్రిని తిరుపతి సాగర్ షోరూం సమీపంలో కారుతో ఢీకొట్టాడు…
వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర శనివారం.. పల్నాడు జిల్లాలో అడుగుపెట్టింది. నరసరావుపేటలో నిర్వహించిన సామాజిక న్యాయభేరి భారీ బహిరంగ సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు పాల్గొన్నారు. టీడీపీ మహానాడు, చంద్రబాబు తీరుపై మంత్రులు ధ్వజమెత్తారు.
తిరుమల లడ్డూ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ లో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదాల తయ్యారికి వినియోగించే పదార్దాల నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి. నాణ్యత లేని జీడి పప్పు సరఫరా చేసిన టెండర్ ని రద్దు చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఏలకుల నాణ్యత పరిశీలనకు ల్యాబ్ కి పంపాలని సూచించారు. ఆవు నెయ్యి నాణ్యత పై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన…
తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. అయితే పెట్రోల్ డీలర్స్ మాత్రం మండిపడుతున్నారు. ఒక్కసారిగా తగ్గించిన పెట్రోల్ ధరలతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చిందంటున్నారు. డీలర్ కమిషన్ లో సైతం న్యాయం లేదంటూ తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31వ తేదీన 16 రాష్ట్రాలో నో పర్చేస్ డే ప్రకటించారు. మొన్నటి వరకు భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో నానా తిప్పలు పడ్డారు వాహనదారులు, పెట్రోల్ డీలర్స్.…
ప్రకాశం జిల్లాలో జరుగుతున్న టీడీపీ మహానాడు 2022 కి భారీ ఎత్తున తరలివచ్చారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఈ సందర్భంగా టీడీపీ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. పొత్తుల గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండానే మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టడం విశేషం. ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్దంగా ఉండాలంటూ రాజకీయ తీర్మానంలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పక్కా వ్యూహాలతో వెళ్లాల్సిన అవసరం ఉందంటూ రాజకీయ తీర్మానంలో…
వైసీపీ మంత్రులు, నేతలు ప్రారంభించిన సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర రాజమండ్రి చేరుకుంది. అనంతరం జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు మంత్రి విశ్వరూప్. నిన్నటి నుంచి యాత్రకు హాజరు కాలేదు విశ్వరూప్. అమలాపురం ఘటన తర్వాత అసంతృప్తితో ఉన్నారు మంత్రి విశ్వరూప్. బహిరంగసభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడారు. సభా సమయం ఆలస్యం కావటంతో కొంత మంది మహిళలు వెనక్కి వెళ్ళి పోయారు. అనివార్య కారణాల వల్ల నేను బస్సు యాత్రలో పాల్గొన లేక పోతున్నా అన్నారు విశ్వరూప్.…