Vizag Steel Plant : విశాఖ ఉక్కు ఉద్యమానికి 500 రోజులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడి నేటికి 500రోజులకు చేరుకుంది. ఎన్నో ఒత్తిళ్లు, మరెన్నో అడ్డంకులు ఇవేవీ కార్మిక, ఉద్యోగుల ఉక్కు సంకల్పం ముందు నిలబడలేకపోయాయి. పైగా రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమ ప్రణాళికలు మరింత రాటుతేలాయి. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటంలో భాగంగా నేడు భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తోంది జేఏసీ. ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇప్పటికే ఢిల్లీలో లావాదేవీల సలహా కమిటీ, న్యాయ సలహా కమిటీని ఏర్పాటు చేశారు. ఉక్కు పరిశ్రమని కాపాడేందుకు కోటి సంతకాల ప్రచారం, పాదయాత్రలు, ర్యాలీలు, రాష్ట్రవ్యాప్త బంద్‌లు, రిలే నిరాహార దీక్షలు, బహిరంగ సభలు, రాస్తారోకోలు చేపట్టి తమ నిరసన తెలిపాయి. వీరి ఆందోళనలకు అధికార వైసీపీ కూడా మద్దతు తెలిపింది.
ఆంధ్రుల హక్కుగా సంక్రమించిన విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడు కోవడానికి కార్మిక శక్తి పిడికిలిబిగిం చి 500రోజులైంది. ప్రయివేటీకర ణను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన పోరాటం నిరవధికంగా కొనసాగు తోంది. కార్మికులు,ఉద్యోగుల పోరా టాలకు ప్రజలు,రాజకీయ పక్షాల సంపూర్ణ మద్దతు లభించడంతో పొరుబాటులో ఉంటూనే ఫ్యాక్టరీ ని లాభాల పట్టించారు కార్మికులు. 500రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తోంది.
Also Read
- OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
కూర్మన్నపాలెంలో ని స్టీల్ ప్లాంట్ ఆర్చి దగ్గర నుంచి వందల మంది కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. వీరికి నిర్వాసితులు కలిసి రావడంతో ఈ ర్యాలీ ద్వారా కేంద్రం దృష్టికి తమ డిమాండ్ ను బలంగా తీసుకెళ్లాలనేది ప్రయత్నంగా చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి సిటీలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం జంక్షన్ వరకు సుమారు 20కి.మీ బైక్ ర్యాలీ జరుగుతుంది. అక్కడి నుంచి రాజకీయ పక్షాలతో కలిసి భారీ పాదయాత్ర చేపట్టనున్నారు కార్మికులు. జీవీఎంసీ దగ్గర నిర్వహించే బహిరంగ సభ ద్వారా తమ గళం మరింత గట్టిగా ఢిల్లీకి వినిపించడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవాలనేది ప్రయత్నం.స్టీల్ ప్లాంట్ కార్మికుల ప్రదర్శనతో సిటీలో ట్రాఫిక్ మళ్ళింపు చేపట్టారు పోలీసులు.
Viral News: వీడేం దొంగ.. చిల్లర డబ్బులు దేవుడికే
- Tags
- 500 days movement
- ap
- bike rally
- JAC
- modi
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!